తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంత మంది ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ కలిపించుకుంటే  మరి కొంతమంది.. కేవలం కొన్ని దశాబ్దాల వరకు మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమలో  తమ హవా నడిపిస్తూ ఉంటారు. ఇలా స్టార్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటు తన హవా నడిపించి ప్రస్తుతం అవకాశాలు లేక మూగబోయిన హీరోయిన్ త్రిష. ఒకప్పుడు త్రిష సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఎగబడి చూసేవారు. కేవలం తన నటనతోనే కాదు తన అందంతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఏమైందో కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. 

 

 

 త్రిష కూడా తెలుగు చిత్ర పరిశ్రమను వదిలి అటు తమిళ చిత్ర పరిశ్రమపై  ఎక్కువ దృష్టి పెట్టడం అక్కడ వరుస అవకాశాలు అందుకోవడం తో తెలుగు చిత్ర పరిశ్రమ వైపు మరోసారి తిరిగి చూడలేదు. దీంతో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్గా తన ప్రస్థానాన్ని కొనసాగించిన త్రిష ఆ తర్వాత పూర్తిగా కనుమరుగై పోయింది అనే చెప్పాలి. దాదాపుగా ఏ సినిమాలో కూడా కనిపించలేదు త్రిష. అయితే స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించిన సమయంలో తన అందాల ఆరబోతతో నే కాదు... చిలిపి నవ్వుతో కూడా ఎంతో మంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలు అంతగా ఆడకపోవడం... చిత్ర పరిశ్రమలోకి కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుండడం ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న త్రిషకి క్రమక్రమంగా క్రేజ్  తగ్గుతూ వచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమలో. ఇక ఈ అమ్మడు సినిమాలు కూడా అంతగా ప్రేక్షకాదరణ కూడా పొందక పోవడంతో ఎక్కడో తేడా కొట్టేసింది. దీంతో పూర్తిగా అవకాశాలు కరువవడంతో తమిళ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ మాత్రం ఈ అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి అని చెప్పాలి. ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కానీ తర్వాత మాత్రం ఎక్కడో తేడా కొట్టేసి పూర్తిగా చిత్ర పరిశ్రమకు దూరం అయింది త్రిష.

మరింత సమాచారం తెలుసుకోండి: