రవితేజ, జగపతి బాబు, శ్రీకాంత్ అర్జున్ లాంటి హీరోల సరసన నటించిన కావేరి/కల్యాణి 2002వ సంవత్సరంలో శేషు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అదే సంవత్సరంలో రవితేజ సరసన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. 2003వ సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాలలో విభిన్నమైన పాత్రలలో అలవోకగా నటించి తెలుగు ప్రేక్షకులందరికీ తాను ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.


2008వ సంవత్సరంలో విడుదలైన రక్ష సినిమాలో జగపతిబాబు భార్య క్యారెక్టర్లో నటించిన ఈమె 2010వ సంవత్సరంలో బ్రహ్మలోకం టు యమలోకం సినిమాలు సరస్వతీ దేవత పాత్రలో నటించి వావ్ అనిపించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తెలుగు సినిమాల్లో దూసుకెళ్లింది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో కూడా హీరో వదిన పాత్రలో చాలా అద్భుతంగా నటించింది అందరినీ బాగా అలరించింది. యాత్ర సినిమాలో కూడా ఓ ప్రధాన పాత్రలో నటించి అందర్నీ బాగా అలరించింది. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు కావేరీ దాదాపు 50 మలయాళ సినిమాల్లో నటించి అక్కడ అగ్రతారగా పేరు తెచ్చుకుంది.


మే 1వ తేదీ 2005వ సంవత్సరంలో ఫిలిం డైరెక్టర్ సూర్య కిరణ్ ని కావేరి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటినుండి ఆమె హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటూ ఎక్స్పోజింగ్ అవసరమే లేని పాత్రలలో అడపాదడపా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాను మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంది. ఈసారి డైరెక్టర్, నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుంది కావేరి. వెండితెరను మినహాయించి కావేరి బుల్లితెరలో కూడా అరంగేట్రం చేసి తమిళ మలయాళ సీరియల్ లలో నటించి టీవీ ప్రేక్షకులను కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. కబడ్డీ కబడ్డీ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో నటించినందుకు గానూ ఈమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏదేమైనా చీరకట్టు అందాలతో యువతని స్క్రీన్లకు కట్టేసిన ఈమెకి లక్షలాది మంది రుణపడి ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: