మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. ఎనభై, తొంభై దశకాల్లో చిరంజీవి తన డ్యాన్సులు, ఫైట్లతో ఇండస్ట్రీని హోరెత్తించారు. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ ఆయనంటే విపరీతమైన అభిమానం చూపడానికి కారణం ఆయన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్సే కారణం. అందుకే ఆయన ఫ్యాన్స్ కోసం నిత్యం కష్టపడుతూనే ఉంటారు. కష్టపడటం అనడం కంటే ఇష్టంతో ఆయన పని చేస్తారని చెప్పాలి. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న ఆయన లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యారు. సినిమా కోసం ఆయన వయసును కూడా లెక్క చేయకుండా మరింత చార్మింగా సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఉన్న లుక్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పిక్ లో మెగాస్టార్ ను చూస్తుంటే ఈయన 64ఏళ్ల వయసులో ఉన్నారా.. లేక 46ఏళ్ల వయసులో ఉన్నారా.. అనిపించక మానదు. ముదురు నీలం రంగు టీషర్టులో చాలా చార్మింగ్ లుక్ లో ఉన్నారు చిరంజీవి. 1997లో వచ్చిన మాస్టర్ సినిమాలో ఉన్నట్టే ఉన్నారని చెప్పాలి. మెగా ఫ్యాన్స్ అంతా ఆయన లుక్ చేసి మురిసిపోతున్నారు. ఆచార్యలో ఆయన పోషించే సీరియస్ లుక్ తో పాటు పాటల్లో గ్లామర్ గానూ కనిపించాల్సి ఉంది.
షూటింగ్ ప్రారంభమైతే వెంటనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తాను సిద్ధంగా ఉన్నానని మెగాస్టార్ చెప్పకనే చెప్తున్నట్టుంది. ఆచార్య తర్వాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించే అవకాశం ఉంది. తర్వాత ఆయన చెప్పిన ప్రకారం బాబీ, మెహర్ రమేశ్, సుకుమార్ లతో సినిమాలు లైన్ లో ఉన్నాయి. వరుస ప్రాజెక్టులు ఉండటంతో మెగాస్టార్ కూడా ఫుల్ ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ రివీల్ చేసిన పిక్ ఆకట్టుకుంటోంది.