కరోనా వల్ల ప్రపంచం అంతా సతమతమవుతుంది. కరోనా పుణ్యమా అని ప్రజలు బయటకు రాని పరిస్థితి. సినిమాలు, రెస్టారెంట్ లు, పబ్ లకు తిరిగి ఎన్ని రోజులు అవుతుందో. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం సినిమా రంగంపై బాగా ప్రభావం చూపింది. సినిమా హల్లు, థియేటర్స్ మూత పడిపోయాయి. దీనితో సినీ రంగానికి చెప్పుకోలేంత నష్టం వాటిల్లింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇల్లూ ఇప్పుడు హోమ్ థియేటర్‌ లా మారిపోయింది. థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటం దండగ అని అభిప్రాయ పడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాని సకుటుంబ సమేతంగా తిలకించేయడం పండగ అని చాలామంది సినీ అభిమానులు భావిస్తున్నారు. 


సినిమాహాల్లో అయితే ఒకళ్ళే వెళ్లి చూస్తారు కానీ ఓటిటి లో అయితే ఎంచక్కా ఇంట్లో కూర్చుని కుటుంబసమేతముగా ఖర్చులేకుండా నచ్చింది తింటూ సినిమా చూడొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి, సినిమాలతో పోల్చితే, వెబ్‌ సిరీస్‌లకు ప్రజలు బాగా ఆకర్షితులవుతున్నారు. దర్శక దిగ్గజుడు రాజమౌళి లాంటి దర్శకుడే వెబ్‌ సిరీస్‌ లలో కంటెంట్‌ అత్యద్భుతంగా వుంటోందని చెబుతున్నాడంటే ఇంకా మీరే అర్ధం చేసుకోవాలి.

 

నిజానికి, కరోనా వైరస్‌ కంటే ముందే, వెండితెరను ఓటీటీ దారుణంగా దెబ్బకొట్టింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ పుణ్యమా అని, సినిమాల ఊసు మర్చిపోయారు జనం. టీవీలో వేసిన సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో మెదిలే ప్రశ్న ఒక్కటే మళ్ళీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా.? రారా.? అన్న ప్రశ్న... మరోపక్క, ‘ఓటీటీ కే ప్రజలు  ఎక్కువ ఓట్లు పడ్డాయి. థియేటర్లు వద్దే వద్దు అని కొంతమంది నెటిజన్లు సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. ‘మీరేమో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశామని చెబుతుంటారు.. అందులో కంటెంట్‌ వుండడం లేదు. దానికి తోడు దియేటర్లు ప్రేక్షకుల్ని నిలువునా దోచేస్తున్నాయి అని విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ ఎవరు కనివిని ఎరుగరు. ఓటీపీ దెబ్బకు సినిమా పరిశ్రమ భవిష్యత్తులో బాగా దెబ్బతింటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: