తమిళనాట నటుడు విజయ్ సేతుపతి కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. ఎంతో మంది నటులు  హీరోలు ఉన్న విజయ్ సేతుపతి మాత్రం తమిళ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల  లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు విజయ్ సేతుపతి. ఇక నటుడిగా విజయ్ సేతుపతి  సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు... ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి విజయ్ సేతుపతిని . ముఖ్యంగా తమిళ నటుడు విజయ్ సేతుపతి దైవ విగ్రహాల గురించి ఓ టీవీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడమే కాదు... విజయ్ సేతుపతిని  ఎన్నో విమర్శల పాలు కూడా చేస్తున్నాయి. 

 

 

 ఇంతకీ ఏం జరిగిందంటే... తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి దైవ విగ్రహాలు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో విగ్రహాల అభిషేకానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారని... అయితే పట్టువస్త్రాలు ధరించేటప్పుడు మాత్రం అనుమతించరూ  అంటూ నటుడు విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపి అతన్ని వివాదాల్లోకి  నెట్టాయి . అయితే విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలపై అటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా తిరుచ్చి  లో అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు  విజయ్ సేతుపతి దైవ విగ్రహాలకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాకుండా అక్కడి కమిషనర్ కార్యాలయంలో కూడా విజయ్ సేతుపతి పై  ఫిర్యాదు చేశారు. 

 

 

 అంతే కాదు అటు బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విజయ్ సేతుపతి వ్యాఖ్యలను తప్పుబడుతూ మండిపడుతున్నారు. తాజాగా  విజయ్ సేతుపతి పై ఈరోజ్  జిల్లా బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.విజయ్ సేతుపతి దైవ విగ్రహాలు పై చేసిన వ్యాఖ్యలు జాతీయ సమైక్యతను హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అంటూ ఆరోపించారు బిజెపి నేతలు. అంతే కాకుండా వెంటనే విజయ్ సేతుపతి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు బిజెపి నేతలు. ఇక విజయ్ సేతుపతి వ్యాఖ్యలను తప్పుబడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు భారీ మొత్తంలో బిజెపి నేతలు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో అక్కడ స్వల్ప  ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: