వయసుతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంత ఎనర్జిటిక్ గా ఉంటారో చూస్తూనే ఉన్నాం. ఆఫ్ స్క్రీన్ లో ఎంత సరదాగా ఉంటారో ఆయన సోషల్ మీడియాను ఫాలో అయ్యే పద్ధతే చెప్తోంది. ఎంటర్ టైన్మెంట్ అంశమైనా.. ఇంపార్టెంట్ అయినా చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన  వంటగదిలో ఏదో ప్రిపర్ చేస్తున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. చిరంజీవి పక్కన సతీమణి సురేఖ కూడా ఉన్నారు. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

 

లాక్ డౌన్ లో ఇంటిపట్టునే ఉన్న ఆయన వంటింట్లో భార్యకు సాయం చేస్తున్నారు. ఇప్పటికి సరిగ్గా 30ఏళ్ల క్రితం ఫ్యామిలీతో అమెరికా వెళ్లినప్పుడు వంటగదిలో వంట చేస్తూ భార్యకు హెల్ప్ చేస్తున్న ఫోటోను యాడ్ చేశారు. ఆ ఫోటోకు ‘అమెరికా జాయ్ ఫుల్ హాలిడే 1990’ అని.. ఇప్పుడు వంటగదిలో ఉన్న ఫోటోకు ‘జైల్ ఫుల్ హాలిడే ఇన్ కరోనా 2020’ అని క్యాప్షన్ ఇచ్చారు. విశేషం ఏంటంటే అప్పుడు, ఇప్పుడు సేమ్ స్టిల్, సేమ్ కలర్ డ్రెస్సింగ్ తో వీరిద్దరూ ఉండటం. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచీ, మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరోగా, హ్యూమన్ బీయింగ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా మీకు మీరే సాటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో అందరిలానే మెగాస్టార్ కూడా ఇంటికే పరిమితమైపోయారు. మొక్కలకు నీళ్లు పోయడం, మనవరాళ్లతో ఆడుకోవడం, అభిమానులను ఉత్తేజితుల్ని చేయడం, మంచి పనులు చేస్తున్నవారిని ప్రోత్సహించడం చేస్తున్నారు. అయితే.. జ్ఞాపకాల్ని నెమరువేసుకోవడంలో కూడా తాను మెగాస్టార్ నే అంటున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉన్న చిరంజీవికి ఫాలోవర్స్ కూడా 500K తక్కువ సమయంలోనే వచ్చారు. లౌక్ డౌన్ సడలింపులు రాగానే ఆచార్య షూటింగ్ లో పాల్గొననున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

తాను..నేను. కాలం మారినా...దేశం మారినా ... #LockdownTimes

A post shared by chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: