ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉర్రూతలూగిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు తమన్. ప్రస్తుతం తమన్ తనదైన మ్యూజిక్తో మాయ చేసేస్తున్నాడు అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులందరినీ మెస్మేరైజ్  చేస్తూ అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు సంగీత దర్శకుడు తమన్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అయితే తమన్  సినిమాకు మ్యూజిక్ ఎంత వెన్నెముక లాంటిది అన్నది నిరూపిస్తున్నారు. సరికొత్త మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 

 


 అయితే తాజాగా ఇటీవలే తమన్ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన సినిమా అలా వైకుంఠపురములో. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో  తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగా మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి. ఈ సినిమాలో తమన్ అందించిన ప్రతి పాట  ప్రేక్షకుడి మదికి  చేరింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హలో లైవ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాలో తన మ్యూజిక్ గురించి చెబుతూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. 

 


 తన మ్యూజిక్ ఎంత బాగున్నప్పటికీ  దానికి అల్లు అర్జున్ డాన్సులు తోడయ్యే సరికి ఆ పాటలు మరింత అందం గా మారిపోయాయి అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అల్లు అర్జున్ పై  ప్రశంసలు కురిపించాడు. తన మ్యూజిక్ కి అల్లు అర్జున్ డాన్స్ లూ తొడవకపోతే తనకు అంతగా గుర్తింపు వచ్చేది కాదేమో  అంటూ చెప్పుకొచ్చాడు తమన్. అందుకే తన పాటలు అంత హిట్ అయ్యాయి అంటే ఆ క్రెడిట్  హీరో అల్లు అర్జున్ కు కూడా వెళ్తుందని... అలా వైకుంఠపురములో సినిమా పాటలు మాత్రమే  కాదు ఇప్పటివరకు తాను అల్లు అర్జున్ సినిమాల్లో చేసిన చాలా పాటలు అల్లు అర్జున్ డాన్స్ కారణంగానే మంచి విజయాన్ని సాధించాయి అంటు తెలిపారు  మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

మరింత సమాచారం తెలుసుకోండి: