తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మాస్టర్ ట్రైలర్ మరి కొద్దీ రోజుల్లో విడుదలకానుంది. ఇప్పటికే ట్రైలర్ కట్ కూడా జరిగిపోయింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు. ఇక ఈ ట్రైలర్ ను చూసిన అర్జున్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు మాస్టర్ ట్రైలర్ ను ఆరు సార్లు చూసాను సూపర్ గా వుంది చివర్లో విజయ్ చెప్పే డైలాగ్ కిరాక్ అంటూ ట్రైలర్ ఫై అంచనాలను మరింతగా పెంచాడు. ఖైదీలో విలన్ గా నటించి మెప్పించిన అర్జున్ దాస్ మాస్టర్ లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 
 
ఈపాటికే విడుదలకావాల్సిన ఈచిత్రం కరోనా వల్ల వాయిదాపడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా దీపావళికి ఈ సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వరస సక్సెస్ లతో విజయ్ తెలుగులోనూ మార్కెట్ ను పెంచుకోవడంతో మాస్టర్ పై అక్కడ కూడా భారీ  అంచనాలు వున్నాయి. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా మాళవిక మోహనన్  హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తుండగా ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈసినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. 
 
ఇక ఈ సినిమా తరువాత విజయ్ మురగదాస్ డైరెక్షన్ లో నటించనున్నాడని టాక్. తుపాకి సీక్వెల్ గా రానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనుండగా సన్ పిక్చర్స్ నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: