మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ లాక్ డౌన్ టైంలో హలో స్పెషల్ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ అండ్ సెకండ్ లవ్ గురించి చెప్పారు. ఈ ఇయర్ అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన థమన్ తన లవ్ మ్యాటర్ గురించి అడిగిన యాంకర్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు. తొలిప్రేమ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు కదా మీ తొలిప్రేమ గురించి చెప్పండి అంటే.. ఆ ప్రశ్న హీరోలు, హీరోయిన్స్ ను అడగాలని అన్నారు థమన్. 


ఇక తన ఫస్ట్ లుక్ మ్యూజిక్ అయితే సెకండ్ లవ్ క్రికెట్ అని.. మ్యూజిక్ కంపోజింగ్ తో పాటుగా క్రికెట్ ఆడటాన్ని కూడా తానూ ఆస్వాదిస్తానని అన్నాడు థమన్. ఇదే లైవ్ లో తనకు ఛాన్స్ ఇచ్చిన రవితేజకు క్రాక్ ద్వారా మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇస్తున్నానని అన్నారు థమన్. తప్పకుండా ఈసారి మరోసారి కిక్ ఎక్కించడం ఖాయమని చెప్పొచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మ్యూజిక్ అందించడం థ్రిల్లింగ్ గా ఉందని. లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికి వకీల్ సాబ్ తో ఎంజాయ్ చేసే వాళ్లమని అన్నారు థమన్. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా మ్యూజిక్ కంపోజర్ ఎంత కష్టపడతారో దానికి న్యాయం చేయడంలో బన్నీ అంత కష్టపడతారని అన్నారు థమన్. 

 

ఇక త్రివిక్రమ్, సిరివెన్నెల వంటి వారితో కలిసి పనిచేయడం లక్కీగా ఫీల్ అవుతున్నట్టు చెప్పాడు థమన్. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న థమన్ రాబోయే సినిమాల్లో కూడా తన సత్తా చాటుతాడని తెలుస్తుంది.  దేవి కొద్దిగా బ్యాక్ అవడమే ఆలస్యం ఈ గ్యాప్ లో థమన్ క్రేజీ ఆల్బమ్స్ ఇస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడు.           

మరింత సమాచారం తెలుసుకోండి: