రణ్ బీర్ - దీపికా పడుకొనే ఈ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అప్పట్లో వీరి ప్రేమగురించి వచ్చిన వార్తలు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న వీరు.. పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని అనుకున్నారంతా. దీపికా అయితే ఏకంగా రణ్ బీర్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని మరీ వారి ప్రేమ స్ట్రాంగ్ అని నిరూపించింది. ఇక ఏమైదో ఏమో కాని ఊహించని విధంగా  వీరి ప్రేమకు బ్రేకప్ చెప్పిన దీపిక మరో బాలీవుడ్ స్టార్ హీరో  రణ్ వీర్ ని పెళ్లి చేసుకుంది.

 

దీపికా - రణ్ బీర్ లు  కలిసి బచ్నా ఏ హసీనో, ఏ జవానీ హై దివానీ లాంటి హిట్ సినిమాల్లో నటించారు. చివరిగా 2015 లో వచ్చిన తమాషా మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాల టైమ్ లోనే ప్రేమలో పడ్డ వీరు పీకల్లోతు మునిగిపోయారు. ఇక  బ్రేకప్ తరువాత మరో సినిమా చేయని ఈ జంట.. కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఐదేళ్ల గ్యాప్ తరువాత రణ్ బీర్ దీపికలు మళ్లీ తెలుపై సందడి చేయనున్నట్టు బాలీవుడ్ లో న్యూస్ హల్ చల్ చేస్తోంది.

 

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ప్రస్థుతం ఆలియాతో గంగూబాయ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత 1952 లో వచ్చిన డిఫరెంట్ పిక్చర్ బైజా బావ్రా ను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో రణ్ బీర్ - దీపిక జంట అయితేనే బాగుంటుందని.. వారినే ఫిక్స్ చేసుకోవాలని డైరెక్టర్ ఆలోచన. దీనికోసం వారిద్దరిని ఒప్పించే ప్రయత్నాలలో ఉన్నాడట సంజయ్. ఇక వీరు అన్నీ మర్చిపోయి.. ఈసినిమాకు ఒప్పుకుంటే ఐదేళ్ళ తరువాత ఈ మాజీ ప్రేమికులను తెరమీద చూసి బాలీవుడ్ ఆడియన్స్ పండగ చేసుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: