పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ ప్రేక్షకులకి బాగా సుపరిచితమైన పేరు. పవన్ కళ్యాణ్ ని తన ఫ్యాన్స్ ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. పవన్ కళ్యాణ్ మెగా స్టార్ చిరంజీవి తమ్ముడు అయ్యినప్పటికి  పవన్ తనకు తానుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. పవన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అయితే 1996 లో వచ్చిన ఆ చిత్రం పవన్  కళ్యాణ్ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

 

కాని పవన్ కళ్యాణ్  మాత్రం వెనుకాడలేదు. సినిమా తరువాత సినిమా చేస్తూనే ఉన్నారు. 1998 లో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రం లో నటించారు. ఆ సినిమా పవన్ కు మంచి విజయాన్ని అందించింది.  కరుణాకరన్ దర్శకత్వం లో తెరకెక్కిన  తొలి ప్రేమ సినిమాకు దేవ గారు సంగీతం అందించారు. 1998 లో తెలుగు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్ లభించింది. అదే సంవత్సరం ఈ సినిమా ఉత్తమ చలన చిత్రం గా నంది అవార్డును గెలుచుకుంది. ఎస్ ఎస్ సి ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జి వి జి రాజు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

  

కరుణాకరన్ కి దర్శకునిగా ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రంలో మనం చెప్పుకోదగినవి దేవ అందించిన సంగీతం. ఈ చిత్రం మొత్తం బాలు, అనూల కలయిక పై సాగుతుంది. చివరికి ఎయిర్ పోర్ట్ లో అను బాలుని ప్రేమిస్తున్నానని గ్రహించి బాలుకి తన ప్రేమ ప్రతిపాదన వెల్లడిస్తుంది. దీనితో ఇద్దరు ఒకటవుతారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రొమాంటిక్ చిత్రంగా మంచి వసూళ్ళనే సాధించింది. ఏది ఏమైనా ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ కి యూత్ లో క్రేజ్ పెరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: