ఇపుడు ఎవరూ సినిమాల గురించి ఆలొచించడంలేదు. సినిమాలు అన్నవి అంతా బాగున్నాక, సాధారణ పరిస్థితి వచ్చాక మాత్రమే. ఎందుకంటే దేశంలో ఇపుడు కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి కట్టడి కొంత వరకు అయినా జరగాలి. ఇక ఆ తరువాత దేశం సాధారణ స్థితికి రావాలి.

 

ఆకలి కేకలకు సమాధానం దొరకాలి. అసలే ఆర్ధిక మాద్యం ఉంది. రూపాయి పాపాయి తగ్గిపోతోంది. దానికి తోడు అన్నట్లుగా కరోనా వచ్చేసి దేశ ఆర్ధిక వ్యవస్థను  పూర్తిగా తల్లకిందులు చేసింది. అందులో అవన్నీ దారిన పడాలి. అపుడూ సినిమాలు, క్లబ్బులు, పబ్బులూ, వినోదాలు  ఇవన్నీ చూడాలి.

 

నిజానికి సామాన్యుడి జీవితంలో ఇపుడు వినోదం కనీస అవసరం కాదు. సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చుట్టూ చీకటి, చేతిలో డబ్బులు అయితే లేవు. దాంతో సినిమాలకు వెళ్లడం అంటే ఇప్పట్లో అయ్యే పని కాదు, చాలా మంది ఇంట్లో టీవీలకు కేబుల్ వాళ్ళకు డబ్బులు కట్టలేక అవస్థలు పడుతున్న సీన్ ఉంది. 

 

అలాంటిది సినిమాలకు వెళ్లడం అంటే జరగదు. ఇది జనం వైపు నుంచి బాధ. మరో వైపు చూస్తే ప్రభుత్వాలు కరోనా కట్టడికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. జనాలు గుంపులుగా చేరకూడదని రూల్స్ పెడుతున్నాయి. సినిమా హాళ్ళు తీస్తే జనం కొంత మంది అయినా అక్కడికి వస్తే కరోనా సోకుతుందేమోనని అందరికీ భయమే. నిజంగా దీనికి వీలు కూడా ఉంది.

 

దాంతో ఇపుడు సినిమాలకు నో పర్మిషన్ అనేస్తున్నారు. తెలంగాణా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే సినిమా హాళ్ళు మరో మూడు నెలల వరకూ తెరచుకోవు అని పక్కా క్లారిటీగా  చెప్పేస్తున్నారు. ఓ విధంగా ఇది ఎగ్జిబిటర్లకు భారీ షాక్. సినిమా నడిస్తేనే వ్యాపారం చేసుకుని బతికే వీలుంది. అలాంటిది ఇప్పటికి రెండు నెలలు ఖాళీగా గడిచాయి. మరో మూడు నెలలు అంటే మాత్రం ధియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కానీ తప్పని పరిణామమిది. అంతే 

మరింత సమాచారం తెలుసుకోండి: