మాస్ దర్శకులకు తిరుగే ఉండదు. కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకునే మేకర్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే సక్సెస్ ఉన్నంత వరకే ఈ హడావిడి కనిపిస్తుంటుంది. ఫ్లాపులు ఎదురైతే చాలు మొత్తం సినిమా మారిపోతుంది. మాస్ డైరెక్టర్ల మార్కెట్ పైనా ప్రభావం పడుతుంది. హిట్ కొట్టాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మాస్ మేకర్స్ ఇలాంటి ప్రెజర్ లో పడ్డారు. 

 

బోయపాటి శ్రీను సినిమా అంటే చాలు బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ తో థియేటర్లు హంగామా చేస్తాయి. అయితే వినయ విధేయరామ రిజల్ట్ ఈ దర్శకుడిని నిరాశపరిచింది. అడ్వాన్స్డ్ లెవల్ అన్నట్టు బోయపాటి డిజైన్ చేసిన యాక్షన్ సీన్ లు ప్రేక్షకులను భయపెట్టాయి. దీంతో బోయపాటిపై ట్రాల్స్ కూడా వచ్చాయి. 

 

వినయ విధేయ రామ కంటే ముందు బోయపాటి తీసిన జయజానకి నాయక కూడా అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో బోయపాటి మార్క్ తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. సో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే బోయపాటిబ్లాక్ బస్టర్ ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు బాలకృష్ణతో తీస్తోన్న అఘోరా మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలవాలి. 

 

కమర్షియల్ హిట్స్ తో మాస్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు వి.వి.వినాయక్ మాసిజంతో బీ, సీ సెంటర్స్ ని మాయ చేసిన ఈ దర్శకుడు ఇంటెలిజెంట్ తర్వాత మరో మూవీ మొదలుపెట్టలేదు. ఇక ఫ్లాప్ తర్వాత యాక్టింగ్ లోకి వెళ్లాడు వినాయక్. శీనయ్య అనే సినిమాలో నటించాడు. అయితే ఈ మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మరి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ మళ్లీ ఎప్పుడు మెగా ఫోన్ పడతాడు అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. 

 

కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ అనిపించుకున్న దర్శకుడు శ్రీనువైట్ల. చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన వైట్ల ఇప్పుడో మీడియం బడ్జెట్ మూవీ మొదలుపెట్టడానికి కూడా కష్టపడుతున్నాడట. అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ తో ఈ దర్శకుడి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని.. చిన్న హీరోలు కూడా శ్రీనువైట్ల అంటే ఆలోచించే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు ఇండస్ట్రీ జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: