ఇప్పుడు ఏ భాషలో అయినా సరే హీరోలు పాటలు పాడటం అనేది ప్యాషన్ గా మారిపోయింది అనేది వాస్తవం. హీరోలు పాటలు పాడితే సినిమాలు హిట్ అవుతాయి అనే భావన లో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇక ఇప్పుడు మన తెలుగులో కొందరు హీరోలు అప్పుడు అప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో పవన్ కళ్యాణ్. ఆయన కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు. ఆ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆయన ఒక సినిమాలో పాట పాడటానికి సిద్దమవుతున్నారు అని అంటున్నారు. 

 

ఆయన క్రిష్ సినిమాలో ఒక పాట పాడటానికి రెడీ అయ్యారని ఒక రచయిత ఇప్పటికే పాట ను కూడా సిద్దం చేసారు అని సమాచారం. ఆ పాట ఎలా ఉంటుంది అనేది తెలియదు గాని పోరాటం చేసే విధంగా ఉంటుంది అని ఆ విధంగా పాటను రెడీ చేసారు అని సమాచారం. త్వరలోనే ఈ పాట ను షూట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ పాటను విడుదల కూడా చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే ఒక వీడియో ని కూడా విడుదల చేసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఈ పాట ను ఇప్పటికే పూర్తిగా సిద్దం చేసారు అని కూడా సమాచారం. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా మారిపోయారు అని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ వినపడుతుంది. ఈ సినిమా తర్వాత ఆయన సినిమా క్రిష్ దర్శకత్వంలో తర్వాత  ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉంటుంది అని సమాచారం. త్వరలోనే స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: