IHG's healthy gesture gives ...

 

మహేష్ బాబు నిజ జీవితం లో చాలా గొప్ప మానవతావాది. రీల్ లైఫ్ లో ఎలా ఉంటారో రియాల్ లైఫ్ లో కూడా మానవత్వాన్ని చాటుతుంటారు. సినీ పరిశ్రమలో అయన గురించి నెగటివ్ గా చెప్పేవారు లేరంటే అతిశయోక్తి కాదేమో...అట్టడుగు స్థాయి ఆర్టిస్ట్ దగ్గరనుండి  సినీ ప్రముఖులవరకు మహేష్ గొప్పతనాన్ని చెప్పకుండా ఉండలేరు...సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చిన సొంతమనిషిలా ఫీల్ అవుతారు మహేష్. కొన్ని సాధారణ కథలు కూడా మహేష్ బాబు చేయడం వల్ల అవి మరింత ఆదరణ పొందుతున్నాయి.

IHG

 

మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలకు అవరమైన రోడ్లు తాగునీరు , పాఠశాలల నిర్మాణాలు ...ఇలా ఎన్నో సహాయ కార్యక్రమాలు మహేష్ బాబు చేశారు..ఈ క్రమంలోనే అమెరికానుంది ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించి దాదాపు 1000 మంది చిన్నారులకు శాస్త్ర చికిత్స చేయించారు. అదేవిధంగా తనీష్ అనే అబ్బాయి కాన్సర్ తో బాధ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మహేష్ అందుకు కావలసిన పూర్తి ఆర్థిక సహకారాన్ని మహేష్ అందించాడు. మహేష్ మంచి మనిషి మాత్రమే కాదు .. మహేశ్‌ మనసు కూడా చక్కనిదే. మహేష్  పారితోషికంలో 30 శాతం స్వచ్ఛంద సంస్థల కోసం వినియోగిస్తారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రచారం చేసుకోవడం ఇష్టంలేని మహేశ్‌ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారని సమాచారం.

 

IHG

2013 నుంచి మహేశ్‌ ‘హీల్‌ ఎ చైల్డ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నారు. దీని ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల ఆర్థిక సహాయం చేసి, చికిత్స చేయిస్తున్నారు. 2014లో హుద్‌హుద్‌ తుపాను విశాఖలో బీభత్సం సృష్టించినప్పుడు మహేశ్‌ రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు.హాస్యచతురత మహేశ్‌లో ఇతరులకు నచ్చే మరో గుణం. మహేశ్‌ బాబు అంటే ఫ్యామిలీ మ్యాన్.. నిజమేనండీ ఆయనకు సినిమా సెట్‌, ఇల్లు తప్ప మరో లోకం తెలియదు షూటింగ్‌ లేకపోతే ఇల్లే అయన  ప్రపంచమని ఓ సందర్భాల్లో మహేష్ చెప్పడం విశేషం.

 

 

ఈయన తొవలోనే కుమారుడు గౌతమ్ కూడా అడుగులు వేస్తున్నారు తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడం కోసము తన స్నేహితులతో కలిసి “అక్షయ బంధన” పేరిట నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తూ తమ వంతు సాయం చెయ్యడం అందుకు గౌతమ్ నాయకత్వం వహించడం గర్వ కారణంగా ఉందని మహేష్ తెలిపారు.

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: