టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో, చరణ్  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫిక్షన్ కథాంశం తో హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అలియా భట్, ఒలీవియా మోరిస్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  

 

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర ని రివీల్ చేశారు ఆర్ఆర్ఆర్ యూనిట్. లాక్ డౌన్ కి ముందు నుంచే ఈ టీజర్ ని రెడీ చేసే పనిలో తలమునకలైన జక్కన్న బృందం చరన్ బర్త్ డే కి గిఫ్ట్ గా ఈ టీజర్ ని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి తారక్ పాత్ర ని చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇక యూనిట్ కూడా ఎన్.టి.ఆర్ బర్త్ డే గిఫ్ట్ గా తారక్ పాత్రని రివీల్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. మే 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తారక్ పోషించిన కొమరం భీం పాత్ర తో వీడియో టీజర్ ని రిలీజ్ చేసి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. కాని ఈ విషయంలో  ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి షాక్ తగిలింది.

 

అయితే ఇందుకు ముమ్మాటికి కరోనా కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాస్తవంగా తారక్ బర్త్ డేకి అందరికి సర్‌ప్రై ఇవ్వాలనే జక్కన్న టీం ప్రయత్నించారట. అందులో భాగంగానే టీజ కి కొంత వర్క్ కూడా చేశారట. అయితే వీఎఫెక్స్ తృప్తి నివ్వకపోవడంతో మే 20 న టీజర్ ని రిలీజ్ చేయలేకపోయారని సమాచారం. ఇప్పటికే చరణ్ టీజర్ చూసిన ప్రేక్షకులు తారక్ టీజర్ ని మరింత భారీ స్థాయిలో ఊహించుకోవడం సహజం. కాని ఆ అంచనాలకి తగ్గట్టుగా టీజర్ సిద్దం కాకనే రిలీజ్ డేట్ ని మార్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇలా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసినందుకు తారక్ తో పాటు జక్కన్న బృందం కూడా ఫీలవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: