కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ.. ‌బ్యానర్లపై కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన లేటెస్ట్ సినిమా ‘నిశ్శబ్దం’. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క భాగమతి తర్వాత నటిస్తున్న ఈ సినిమాను సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాగ్డ్రాప్ లో రూపొందించారు. హేమంత్‌ మధూకర్‌ తెరకెక్కించిన ఈ సినిమాను నాలుగు ప్రధాన భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మల్టీ స్టారర్ లో అనుష్కతో పాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే.. ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అన్ని భాషల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

 

అయితే వాస్తవంగా ఈ సినిమాని ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని కోనా టీం ప్లాన్ చేశారు. కాని కరోరానా విపరీతంగా వ్యాపిస్తున్నందు వల్ల విధించిన లాక్‌డౌన్‌ తో సినిమాలన్నిటి తో పాటు నిశబ్ధం కూడా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారు. వాటిలో తెలుగులో ముందు కీర్తి సురేష్ నటించిన "పెంగ్విన్" రిలీజ్ కానుంది. అలాగే సూర్య నిర్మాతగా తన భార్య తో తెరకెక్కించిన ఒక తమిళ సినిమాని ఓటీటీలో లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో 'నిశ్శబ్దం' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ గత కొన్నిరోజులుగా రూమర్లు‌ వస్తున్న సంగతి తెలిసిందే. అందరు అది నిజమని భావించారు కూడా.

 

అయితే ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు కోన వెంకట్. ‘సినిమా పట్ల మాకున్న అమితమైన ఆసక్తి, ప్రేమతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాం. మేము తీసిన సినిమా చూసి థియేటర్‌లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే మాకు ప్రేరణ, ఆక్సిజన్‌. ఆ ఫీలింగ్‌ను ఏదీ మ్యాచ్‌ చేయలేదు. సినిమా ఉన్నది సినిమా హాళ్ల కోసమే. అదే మా ప్రాధాన్యమని కోన వెంకట్‌ తేల్చి పారేశాడు. దీంతో గత కొన్ని రోజులుగా క్రియోట్ అయిన ఫేక్ న్యూస్ కి ఫుల్ స్టాప్ పడింది.

 

అయితే మిగతా నిర్మాతలు కోన వెంకట్ లాగా స్పందించాల్సిందేనా అంటూ చర్చించుకుంటున్నారు. నాని వి సినిమాని నేరుగా ఓటిటి లో రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇది కూడా రూమారా లేక నిజమా అన్నది క్లారిటి లేదు. ఒకవేళ నిజం కాకపోతే ఈ నిర్మాత కూడా స్పందించి క్లారిటి ఇవ్వాలి. లేదంటే రోజుకో న్యూస్ వస్తూనే ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: