టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాల కృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలిసిన అవసరం లేదు. ఆయన డైలాగ్స్ కి పిల్లలు, పెద్దలు కూడా ఫిదా అవుతారు.  ఎన్ టి ఆర్ కు వారసుడిగానే కాకుండా  బాల కృష్ణ  తన కంటూ  ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. బాల కృష్ణ, ఎన్ టి ఆర్ తో కూడా కొన్ని చిత్రాలలో బాల నటుడిగా నటించారు.  ఎప్పటికప్పుడు సరి కొత్త లుక్ తో ట్రెండ్ సెట్ చేస్తారు బాలయ్య. ఈ తరం యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ దూసుకుపోతున్నారు.

 

బాలకృష్ణ సినిమాలు మాత్రమే కాక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కూడా నటించి  మెప్పించారు. దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియో సంస్థ నిర్మించిన 1974 లో వచ్చిన తాతమ్మకల  సినిమా ద్వారా వెండి తెరపైకి తొలి సారి అడుగుపెట్టారు. కొంత కాలం బాల నటుడిగా మెప్పించి మంగమ్మగారి మనుమడు చిత్రంతో నటుడిగా గుర్తింపు పొందాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్ఘవ్ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థ వారు నిర్మించిన మంగమ్మగారి మనుమడు చిత్రం బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమాలో సుహాసిని బాలయ్యతో జత కట్టింది. 

 

ఈ సినిమాకు భానుమతి గారి నటన అద్భుతంగా నిలిచింది. సంగీత పరంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. సుహాసిని, బాల కృష్ణ మధ్య సాగే బావా మరదళ్ల అల్లరి యూత్ ని ఆకట్టింది. పల్లెటూరి అబ్బాయి చుట్టూ తిరిగే కథలో క్లైమాక్స్ లో ఆర్మీ గురించి టచ్ చేయడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారనే చెప్పాలి. దీనికి గాను ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కలెక్షన్ పరంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: