ఎవరికైనా బాధే మరి. అందులోనూ కోట్లకు కోట్లు విలాసంగా కులాసాగా పుచ్చుకునే వారికి ఒక్కసారిగా బడ్జెట్ కటింగ్ పేరిట తెగ్గొడతాము అంటే షాకే మరి. ఇపుడు ఇదే చర్చ టాలీవుడ్లో సాగుతోంది. నిజానికి ఒక్క టాలీవుడ్  సమస్య అని కాదు, భారతీయ చలన చిత్ర పరిశ్రమ మీద కరోనా ఎఫెక్ట్ అలా ఇలా పడడంలేదు, పైగా లాక్ డౌన్ తో మొత్తం డౌన్ అయినట్లుగా ఉంది అంటున్నారు.

 

ఇదిలా ఉండగా ఇకపైన టాలీవుడ్ రిచ్ గా తీయడానికి, బిందాస్ గా ఖర్చు చేయడానికి వీలు లేకుండా కరోనా కత్తెర వేసిందని చెబుతున్నారు. నిజానికి టాలీవుడ్లో మిగిలిన వుడ్ల కంటే కూడా ఎక్కువ ఖర్చు పెడతారు. బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది. అందుకే టాలీవుడ్లో నటించేందుకు హీరోయిన్లు, విలన్లు కూడా ఇతర భాషల నుంచి పరుగు పరుగున వస్తారు.

 

ఇక టాలీవుడ్ మార్కెట్ కూడా గత ఆరేడేళ్ళుగా బాగా విస్తరించింది. ఓవర్సీస్ కూడా బాగా కలెక్షన్ల  పంట పండిస్తున్నాయి. దాంతో ఖర్చు పెరిగినా వసూళ్ళు బాగున్నాయని మేకర్లు పెట్టాల్సిన చోట రాజీ లేకుండా పెడుతున్నారు. కానీ ఇపుడు కరోనా పుణ్యమాని ఓవర్సీస్ కలెక్షన్లు బంద్ అయ్యేలా సీన్ చూస్తే  ఉంది.

 

అలాగే లోకల్ కలెక్షన్లు కూడా పెద్ద డౌట్లో పడ్డాయి. సినిమా అన్నది ఇపుడు జనం చూస్తారా అన్న సీన్ ఉంది. ఉన్నకాడికి సినిమా తీసి జనం ముందుకు తెచ్చి వారిని మళ్లీ ఈ వైపుగా లాగాలంటే తక్కువ ఖర్చుతోనే సినిమాలు తీయాలని నిర్మాతలు డిసైడ్ అవుతున్నారట.  దాంతో పాటు పెద్ద ఎత్తున హీరోల పారితోషికం కూడా కటింగ్ అంటున్నారని తెలుస్తోంది. అయితే భారీ ఎత్తున రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు మాత్రం ఇప్పటికైతే పెదవి విప్పడంలేదని టాక్.

 

అయితే అంతా కూర్చుని ఒక నిర్ణయానికి రావాల్సిన  అవసరం ఉందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. లాక్ డౌన్ ముగిసాకా విస్త్రుత స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి ఆ పైన అంతా కలసి నిర్ణయించుకుంటారని  అంటున్నారు. ఏది ఏమైనా మునుపటిలా భారీ ఎత్తున రెమ్యునరేషన్ అంటే మాత్రం కుదరదు అన్న మాట ఒక్క తెలుగులోనే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో కూడా గట్టిగానే  వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: