టాలీవుడ్ యువ నటుడు నందమూరి తారక రామారావు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేపు తన 36వ పుట్టినరోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ముందుగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమాలో బాల రాముడిగా చిన్నతనంలోనే తన నటనతో అందరినీ ఎంతో ఆకట్టుకున్న ఎన్టీఆర్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక వి ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన నిన్ను చూడాలని సినిమా ద్వారా 2001లో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్, ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి డెబ్యూ డైరెక్టోరల్ మూవీ అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించడం జరిగింది. 

IHG's ...

అప్పట్లో సూపర్ హిట్ కొట్టిన ఆ సినిమా, నటుడిగా ఎన్టీఆర్ కు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తరువాత మెల్లగా ఒక్కో సినిమాతో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగిన ఎన్టీఆర్, తన కెరీర్ లో వచ్చిన ఏడవ సినిమా సింహాద్రిని రాజమౌళి దర్శకత్వంలోనే చేయడం జరిగింది. అప్పట్లో అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆ సినిమా అనంతరం కొంత భారీ గ్యాప్ తరువాత శారీరకంగా తన బరువు పూర్తిగా తగ్గి సోషియో ఫాంటసీ సినిమా అయిన యమదొంగ సినిమాని కూడా రాజమౌళి దర్శకత్వంలోనే ఆయన చేయడం జరిగింది. ఇక మళ్ళి చాలా గ్యాప్ తరువాత మరొక హీరో రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలోనే ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఒకరకంగా ఎన్టీఆర్ కెరీర్ కి సక్సెస్ ల పరంగా రాజమౌళి భారీ పునాదులు వేశారు అనే చెప్పాలి. 

 

ఇక మొదటి నుండి ఎన్టీఆర్ కు, రాజమౌళి కి మధ్య మంచి స్నేహబంధం ఉండడం, అలానే రాజమౌళిని ముద్దుగా జక్కన్న అని పిలవడం ఎన్టీఆర్ కు అలవాటయింది. తన కెరీర్ లో వచ్చిన సినిమాల్లో జక్కన్న అందించిన మూడు సినిమాల సక్సెస్ లు తనకు హీరోగా మంచి బాటలు వేశాయని, ఆయనతో ఉన్న స్నేహబంధం మాటల్లో వర్ణించనలవికానిదని ఎప్పుడూ ఎన్టీఆర్ చెప్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా మంచి హిట్ కొట్టినట్లైతే ఎన్టీఆర్ కెరీర్ లో రాజమౌళి అందించిన సక్సెస్ ల శాతం మరింతగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా మంచి పేరు, సక్సెస్ లు దక్కడంలో రాజమౌళి పెద్ద పాత్రే పోషిస్తారని చెప్పవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: