సూపర్ స్టార్ మహేష్ 26 సినిమాల్లో నటించినా ఇంతవరకు షర్ట్ లెస్ గా కనిపించింది లేదు. అంతేకాదు మహేష్ ఇంట్లో ఎలా ఉంటాడన్నది కూడా తెలియలేదు. కానీ ఈ లాక్ డౌన్ టైం లో మహేష్ గురించి చాలా విషయాలు ఫ్యాన్స్ కు తెలుస్తున్నాయి. తన కొడుకు, కూతురుతో మహేష్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నమ్రత మహేష్ సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్ ఇస్తుంది. రీసెంట్ గా మహేష్, సితార, గౌతమ్ ఉన్న పిక్ షేర్ చేయగా అందులో మహేష్, గౌతమ్ అన్నదమ్ముల అన్న డౌట్ వచ్చేలా మహేష్ గ్లామర్ ఉంది. 


ఇక లేటెస్ట్ పిక్ లో స్విమ్మింగ్ పూల్ లో మహేష్ షర్ట్ లెస్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. కూతురు సీతారాతో పూల్ లో ఆటలాడుతున్న మహేష్ పిక్ షేర్ చేశారు నమ్రత. ఆ పిక్ లో మహేష్ షర్ట్ లెస్ కటౌట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతవరకు మహేష్ ను అలా ఎప్పుడు చూడలేదు. 1 నేనొక్కడినే సినిమాలోనే స్లీవ్ లెస్ బనియన్ తో కనిపించాడు తప్ప ఇలా బేర్ చెస్ట్ చూపించింది ఎప్పుడు లేదు. అందుకే ఇలా ఈ ఫోటో షేర్ చేసిందో లేదో అలా అది వైరల్ గా మారింది. 


ఇక మహేష్ ను ఆ షర్ట్ లెస్ గా చూసిన దర్శక నిర్మాతలు మహేష్ కూడా ఊర మాస్ సినిమా ప్రయత్నించవచ్చని అంటున్నారు. భారీ ఆస్ ఫాలోయింగ్ ఉన్నా ఊర మాస్ సినిమా తీసే కటౌట్ మహేష్ కు ఉందని ఈ పిక్ ద్వారా తెలిసింది. ఇక ఇది చూసిన బోయపాటి శ్రీను, వినాయక్ లాంటి వాళ్ళు మహేష్ తో ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. మరి మహేష్ ను అలా షర్ట్ లెస్ గా వెండితెర మీద చూపించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: