గత కొన్నాళ్లుగా తాను నటిస్తున్న సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎందరో అభిమానులను, ప్రేక్షకులను తన నటన, డ్యాన్స్ లతో అలరిస్తున్నారు. మొదటి నుండి డైలాగ్స్ చెప్పడం లో మంచి దిట్టగా పేరున్న ఎన్టీఆర్, ఇటీవల వచ్చిన జై లవకుశ సినిమాలో తాను పోషించిన రావణ పాత్రలో పలికిన డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. కొంత నత్తిగా ఉండే ఆ డైలాగులను ఎన్టీఆర్ అదరహో అనే రేంజ్ లో అద్భుతంగా పలికారు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న యంగ్ టైగర్, దాని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. 

IHG

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అలానే త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేనాటికి ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవడం ఖాయం అని, దానితో ఆయన ఇమేజ్, మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరుగుతాయని, ఇక ఆ తరువాత ఆయన నుండి వచ్చే సినిమాలు కూడా అదే రీతిలో ఎంతో భారీగా తెరకెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్ సినిమా చేయనున్న ఎన్టీఆర్, అలానే దాని అనంతరం కెజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నట్టు ఇటీవల కొద్దిరోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 

కాగా అందులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు ఎన్టీఆర్, ప్రశాంత్ తో సినిమా చేస్తారా లేదా అనే విషయం అటుంచితే, ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ తో ప్రశాంత్ నీల్ కు ఒక ఒప్పందం జరగడంతో ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్నాళ్ల తరువాత ప్రశాంత్ వారి బ్యానర్ లో సినిమా చేస్తారని, అలానే ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తారని అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ తో పాటు ఆ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 1 తో దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ప్రశాంత్, ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 తీస్తున్నారు. ఇక దాని అనంతరం ఎన్టీఆర్ తో సినిమా తీస్తే తప్పకుండా అది కూడా భారీ రేంజ్ లోనే ఉంటుందని, అలానే ఆ సినిమా కనుక అన్ని కుదిరి హిట్ కొడితే కేకో కేక అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ విషయమై ఏమి జరుగుతుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: