సౌత్ స్టార్ హీరోయిన్ లలో పెళ్లి తర్వాత ఎవరు సమంతలాగా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా కెరియర్ లో మరో కొత్త స్టెప్ తీసుకుంది. సినిమాలకు ఈక్వల్ గా ప్రేక్షకాదరణ పొందుతున్న వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టింది సామ్. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో నటిస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో కనిపిస్తుందని అంటున్నారు. 

 

అదేదో రెగ్యులర్ గా కనిపించే పాత్ర కాదట వెబ్ సీరీస్ లో సమంత టెర్రరిస్ట్ గా నటిస్తుందట. సమంత అలాంటి పాత్ర చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవడం దానికి సీజన్ 2 ప్లాన్ చేయడం సమంత తన ఇంట్రెస్ట్ చూపించడం అంతా అలా జరిగిపోయాయి. సినిమాల్లో హీరోయిన్ గా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించే సామ్ మరి మొదటి ప్రయత్నమే ఆడియెన్స్ షాక్ అయ్యేలా చేయాలని నిర్ణయించుకుంది. 

 

సినిమాల విషయానికి వస్తే మళ్ళీ సమంత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకే ఓకే చెప్పిందని టాక్. నాగ చైతన్యతో కూడా ఒక సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఆ ప్రాజెక్ట్ లపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. ఏది ఏమైనా తెలుగులో సమంత నటన మరో ఐదారేళ్లు కచ్చితంగా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి వెబ్ సీరీస్ క్లిక్ అయితే ఇక వాటి మీద కూడా సమంత ప్రత్యేక ద్రుష్టి పెడుతుందని చెప్పొచ్చు. సినిమాలు చేయకపోయినా సరే వెబ్ సీరీస్ లతో సెటిల్ అవ్వాలని చూస్తుంది ఈ అమ్మడు. ఎలాగూ ప్రోడ్యుసర్ గా కూడా మారుతుంది కాబట్టి ఆమె నిర్మించిన వాటిలో సమంత నటిస్తుందని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: