యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడున్న స్టార్స్ లో నవరస్స కళాపోషణ చేయగల ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అఫ్కోర్స్ మిగతా స్టార్స్ ఏమి తక్కువ కాదనుకోండి.. కానీ ఎన్టీఆర్ చేసినట్టుగా పౌరాణిక పాత్రలు ఈ జెనరేషన్స్ స్టార్స్ టచ్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక డైలాగ్ చెప్పడంలో తారక్ స్టైల్, స్టామినా రెండు తెలిసిందే. 


తారక్ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు. ప్రతి పుట్టినరోజు నాడు తన సినిమా అప్డేట్స్ తో సర్ ప్రయిజ్ చేసే ఎన్టీఆర్ ఈసారి ఆర్.ఆర్.ఆర్ నుండి ఎలాంటి టీజర్ రావడం లేదని తెలిసి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని తానే స్వయంగా అభిమానులకు ఓపెన్ లెటర్ రాశాడు. ఇదిలాఉంటే తన బర్త్ డే కి ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇవ్వకపోయినా ఫ్యాన్స్ మాత్రం పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అదేంటి అంటే ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ తో ట్రేండింగ్ చేయాలని చూస్తున్నారు. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఆయన ఫ్యాన్స్ ఆరోజు 12 మిలియన్ ట్వీట్స్ తో రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ఆ రికార్డ్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. 15 మిలియన్ ట్వీట్స్ తో ట్రెండ్ సృష్టించాలని చూస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ తలచుకుంటే సాధ్యం కానీ పనేమీ కాదు. సో ఎన్టీఆర్ బర్త్ డే నాడు ట్విట్టర్ మొతం తారక్ బర్త్ డే ట్వీట్స్ తో దుమ్ముదులిపేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఆర్.ఆర్.ఆర్ నుండి టీజర్ అయితే రాదనీ చెప్పారు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: