టాలీవుడ్ కుర్రాళ్లు సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ లవర్ బాయ్స్ అనిపించుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ లో డ్యూయెట్స్ పాడుకున్నట్టే.. ఆఫ్ స్క్రీన్ లోనూ ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు. ఇష్టపడ్డవాళ్లను కష్టపడైనా సాధించాలి అన్నట్టు ప్రేమను గెలిపించుకోవడానికి రెండు మూడేళ్లు శ్రమించి ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటున్నారు. 

 

మండే ఎండల్లో సడన్ గా వచ్చిన వర్షంలా.. రానా ప్రేమ వ్యవహారం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. భళ్లాలుడు లవ్ మేటర్ ను ఎనౌన్స్ చేయడం ఆలస్యం, ఇతని ఫియాన్సీ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. రానా,మిహీక బజాజ్ ల లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైందని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే రెండేళ్ల క్రితం మొదలైన వీళ్ల ఫ్రెండ్ షిప్, లాక్ డౌన్ లో ప్రేమగా మారింది. లాక్ డౌన్ తర్వాత ఈ ప్రేమ పెళ్లి పీటలెక్కే అవకాశం ఉంది. 

 

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి లవ్ స్టోరీస్ తో సూపర్ హిట్స్ కొట్టిన నితిన్, రియల్ లైప్ లోనూ ప్రేమ వివాహమే చేసుకుంటున్నాడు. షాలినీ అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు నితిన్. ఎనిమిదేళ్ల నుంచి ఫ్రెండ్ షిప్ లో ఉన్న వీళ్లిద్దరికీ ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ జరిగింది.ఈ లవ్ బర్డ్స్ ఏప్రిల్ లో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ తో వీళ్లిద్దరి పెళ్లి వాయిదా పడింది. 

 

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా లవ్ లో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. చాన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో తాను రిలేషన్ లో ఉన్నట్టు చెప్పాడు విజయ్. అయితే ఇప్పటి వరకు తన ఫియాన్సీ ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు విజయ దేవరకొండ. 

 

లవ్ స్టోరీ లేకుండా సినిమాలేదు. కమర్షియల్ మూవీస్ లో ప్రేమే మెయిన్ ఎలిమెంట్. ఇక టాలీవుడ్ స్టార్లు చాలామందిని ఈ ప్రేమ దోమ కుట్టింది. మాస్, యాక్షన్ అంటూ భారీ ఫైట్ లు చేసే హీరోలను కొత్త బంగారు లోకం లోకి తీసుకెళ్లింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: