టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందంటే ఆ సినిమాపై ఉండే అంచనాలు అన్నీఇన్నీ కావు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రాజమౌళి ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు 11 చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి ప్రస్తుతం 12వ చిత్రం ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నాడు. 


 
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. రాజమౌళి 12 చిత్రాల్లో 4 చిత్రాల్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. మరి జూనియర్ ఎన్టీఆర్ తోనే రాజమౌళి ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణాలేమిటి...? అనే ప్రశ్నకు రాజమౌళి ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో సమాధానం ఇచ్చాడు. బృందావనం సినిమా ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ తనకు జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టాన్ని తెలియజేశాడు. 

 
రాజమౌళి బృందావనం ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తారక్ తో సినిమా చేయాలని తన హృదయం అభిమానుల కన్నా గట్టిగా అరుస్తుందని చెప్పారు. తారక్ తో షూట్ అంటే తాను మ్యాగ్జిమమ్ ఎంజాయ్ చేస్తానని... తాను రాసుకున్న సీన్లకు పూర్తిగా న్యాయం చేసేది తారక్ అని చెప్పారు. అందువల్లే రాజమౌళి తారక్ తో ఎక్కువ సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ జనవరి 8 2021న విడుదల కానుంది. 
 

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సినిమా రికార్డులు సృష్టించగా ఆర్ఆర్ఆర్ ఆ రికార్డులు తిరగరాస్తుందని తారక్, చరణ్ అభిమానులు బావిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ పుట్టినరోజు కానుకగా అల్లూరి పాత్రతో ఆర్ఆర్ఆర్ మోషన్ టీజర్ రిలీజ్ కాగా లాక్ డౌన్ వల్ల మే 20వ తేదీన ఫస్ట్ లుక్, మోషన్ టీజర్ విడుదల చేయడం సాధ్యం కావడం లేదని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: