హీరో నిఖిల్ కి లాస్ట్ ఇయర్ వచ్చిన స్వామిరారా హిట్ మంచి కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. అందుకే తను ఫ్రెష్ టాలెంటెడ్స్ కి అవకాశాలిస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ సినిమా చేస్తున్న నిఖిల్ ఆ సినిమాతో మొండేటి చందు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు నిఖిల్ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడట. నిఖిల్ దర్శకుడిగా పరిచయం చేయబోతుంది ఎవరో కాదు కార్తికేయ సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన్ కార్తిక్ ఘట్టమనేని అట. కార్తికేయ సినిమా కెమెరా పనితనం చూసిన నిఖిల్ కార్తిక్ కి డైరక్షన్ చేసే చాన్స్ ఇచ్చాడట. ఇక నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న కార్తికేయ సినిమా కంప్లీట్ అవ్వగానే న్యూ ఫిల్మ్ ని స్టార్ట్ చేస్తాడట. సో తను ఎదుగుతూ తన పక్కన వారిని కూడా ఎదిగేలా చేస్తున్న హీరో నిఖిల్ కు అన్ని మంచి సినిమాలు పడి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. ఇక కెమరామెన్ కం డైరక్టర్ కార్తిక్ కూడా నిఖిల్ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలను కోరుకుంటున్నారు సిని వర్గాలు. నిఖిల్ కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంపై మీ కామెంట్..? 

మరింత సమాచారం తెలుసుకోండి: