టాలీవుడ్ స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి పేరు, గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ప్రేమలకు, ఇతర విషయాలకు సంబంధించిన పుకార్లు ఎప్పుడూ రాలేదు. కానీ ఒక్క సమీరా రెడ్డి విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకున్నారని... పెళ్లి కూడా చేసుకోబోతున్నారని 15 సంవత్సరాల క్రితం విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. 
 


సమీరా రెడ్డి ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు, అశోక్ సినిమాల్లో నటించింది. తెలుగమ్మాయి అయినప్పటికీ బాల్యంలోనే కొన్ని కారణాల వల్ల ముంబైకి వెళ్లిపోయిన సమీరా రెడ్డికి ఎన్టీఆర్ ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడని కూడా గాసిప్స్ వినిపించాయి. కానీ అసలు నిజం ఏమిటంటే ఎన్టీఆర్ సమీరా రెడ్డిని లవ్ చేసినట్టు వచ్చిన వార్తలు, ఇతర వార్తలు అన్నీ గాసిప్సే తప్ప ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. 

 


అప్పట్లో ఈ వార్తలు విని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదనకు గురయ్యాడని సమాచారం. ఈ రూమర్లు సమీరా రెడ్డిని కూడా ఎంతో బాధపెట్టాయి. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తనపై టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన గాసిప్స్ గురించి స్పందించారు. ఎన్టీఆర్ తో లవ్ వార్తలు కెరీర్ కు ఇబ్బంది కలిగించాయని ఆమె చెప్పారు. తారక్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. 
 

 

సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వాద్రాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఎన్టీఆర్ సమీరా లవ్ గురించి రకరకాల వార్తలు వచ్చినా సమీరా రెడ్డి జవాబుతో ఆ గాసిప్స్ గురించి స్పష్ట వచ్చింది. ఎన్టీఆర్ ఆ తరువాత కాలంలో కొంతమంది హీరోయిన్లలో మూడు, నాలుగు సినిమాల్లో నటించినా ఎటువంటి గాసిప్స్ రాలేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: