టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా వరుస విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. చిన్న వయస్సులోనే హీరోగా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 20 ఏళ్ల వయస్సులోనే సింహాద్రి లాంటి వయస్సుకు మించిన పాత్రలో నటించి మెప్పించారు. కాలంతో పాటు మారుతూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ వరుసవిజయాలతో దూసుకుపోతున్నారు. 


 
రాజకీయాలతో పరోక్షంగా సంబంధాలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. పార్టీ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ తన స్నేహితులైన రాజీవ్ కనకాల, సమీర్, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఖమ్మంలోని బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ సభ అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 
 


నల్దొండ జిల్లాలోని చివ్వెంల మండలం దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ ను ఆస్పత్రిలో చేర్చగా డాక్టర్లతో జూనియర్ ఎన్టీఆర్ తన ఫేస్ కు ఏమైనా గాయాలు అయ్యాయా...? తన నటించడానికి ఆ గాయాల వల్ల ప్రాబ్లమ్ వస్తుందా...? అని అడిగారు. ఒకనోక సందర్భంలో స్వయంగా ఎన్టీఆర్ ఈ విషయాలను వెల్లడించారు. 


 
తీవ్ర గాయాలతో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ఆలోచించడంతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారని సమాచారం. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ గాయాలు పూర్తిగా మానక ముందే అదుర్స్ సినిమా షూటింగ్ లో పాల్గొని షూటింగ్ పూర్తి చేశారు. కాలికి గాయాలు తగ్గకపోయినా అస్సలాం వాలేకుం పాటలో అదిరిపోయే స్టెప్స్ వేసి చిత్ర యూనిట్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. జూనియర్ ఎన్టీఆర్ తన డెడికేషన్ తో సినిమా అంటే తనకు ఎంత మమకారమో పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: