వరుస విజయాలతో సినిమా సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రతో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాలో రాముడి పాత్రలో నటించి మెప్పించారు. నిన్ను చూడాలని సినిమాతో కమర్షియల్ సినిమాలలో హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ సినిమా ఆశించిన మేర సక్సెస్ కాకపోయినా నటుడిగా ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 


 
ఆ తరువాత స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ హీరోగా గుర్తింపు వచ్చింది. సింహాద్రి సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమాల్లో కొంచెం బొద్దుగా కనిపించాడు. రాఖీ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లావుగా కనిపించాడు. ఎన్టీఆర్ లుక్ పై ప్రేక్షకుల్లో కొంతమంది నుంచి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో రాజమౌళి యమదొంగ సినిమాలోని పాత్ర కోసం బరువు తగ్గాలని సూచించాడు. 


 
బరువు తగ్గడానికి జూనియర్ లైపో చికిత్స చేయించుకున్నాడు. ఆ చికిత్స ద్వారా ఏకంగా 30 కేజీలు తగ్గాడు. లైపో చేయించుకుని బరువు తగ్గడంలో ఆశ్ఛర్యం ఏముంది అని చాలామంది సందేహాలు వ్యక్తం చేయవచ్చు. నిజానికి లైపో లాంటి చికిత్సలు చాలా ప్రమాదకరమైనవి. చికిత్స వికటిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. లైపో కొంత ప్రమాదకరమైన చికిత్స అని తెలిసినా జూనియర్ ఎన్టీయార్ రిస్క్ చేసి లైపో చేయించుకుని బరువు తగ్గారు. 
 


ఆ తరువాత సినిమాల్లోని పాత్రలను బట్టి జునియర్ ఎన్టీఆర్ బరువు తగ్గడం పెరగడం చేస్తూ వచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు ముందు కొంచెం బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ప్రస్తుతం స్లిమ్ లుక్ లోనే కనిపిస్తున్నారు. యమదొంగ సినిమా తరువాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ కొమరం భీం పాత్రలో స్వాతంత్ర సమరయోధుడిగా కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: