లాక్ డౌన్ తో ఫిలిం ఇండస్ట్రీ పూర్తిగా మూత పడటంతో చిన్న హీరోల సినిమాల నుండి పెద్ద హీరోల సినిమాల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాణం పూర్తి చేసుకుని అదేవిధంగా సగం నిర్మాణంలో ఆగిపోయిన సినిమాల పై నిర్మాతలు పెట్టిన పెట్టుబడి పరిగానలేకి తీసుకుంటే కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సుమారు 6వందల కోట్లకు పైగా నిర్మాతల డబ్బు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బ్లాక్ అయిపోయింది అన్న ప్రచారం జరుగుతోంది. 


ప్రస్తుతం సినిమాలకు సంబంధించి షూటింగ్ లు ఆగిపోవడంతో భవిష్యత్ లో సినిమాల మార్కెట్ ఎలా ఉంటుందో అన్న భయంతో నిర్మాణంలో ఉన్న సినిమాల బడ్జెట్ తగ్గించుకోవడం కోసం ఆఖ‌రికి సినిమా స్క్రిప్టుల్నికూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల మూవీ ప్రాజెక్ట్ లకు కూడా ఈ కరోనా వల్ల ఊహించని సమస్యలు ఏర్పడినట్లు గాసిప్పులు వస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు పూరి విజయ్ దేవరకొండల మూవీ కథ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో సాగే క‌థ కావడంతో  ఈసినిమా స్క్రిప్టు ప్ర‌కారం ఒక సంద‌ర్భంలో హీరో  విదేశీ ఫైట‌ర్ల‌తో త‌ల‌ప‌డే కొన్ని స‌న్నివేశాలు ఉన్నాయ‌ట‌. అందుకోసం విదేశాల నుంచి ఫైట‌ర్ల‌ను కరోనా ఉపద్రవం ముందు జరిగిన షూటింగ్ కు తీసుకు వచ్చి వారితో విజయ్ దేవరకొండ కొన్ని ఫైట్ సీట్స్ తీసారు. అయితే  ఆతరువాత ఆ ఫైటర్స్ అంతా లాక్ డౌన్‌కి ముందే విదేశాల‌కు వెళ్లిపోయారు అని తెలుస్తోంది. 


ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తిరిగి షూటింగ్ లు మొదలైనా తిరిగి ఆ ఫైటర్స్ ఇండియా రావడానికి ఆసక్తి కనపరచడం లేదు అని టాక్. దీనితో పూరీ జగన్నాథ్ ఆ సన్నివేశాల్ని స్థానిక ఫైట‌ర్ల‌తో మ‌ళ్లీ రీషూట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు ఒక్క పూరీకి మాత్రమే కాకుండా బ్రిటీష్ సోల్జర్స్ తో యుద్ధ సన్నివేశాలు తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా షూటింగ్ దశలో ఉన్న అనేక సినిమాలలోని కీలక సీవ్స్ కరోనా దెబ్బతో అనేక మార్పులకు లోనవుతున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: