రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రాజమౌళి మొదట్లో శాంతినివాసం సీరియల్ ను డైరెక్ట్ చేశాడు. మొదటి సినిమాగా స్టూడెంట్ నంబర్ 1 తీశారు. ఆ సినిమా టైం లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమైనా నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా అనుకుని స్టూడెంట్ నంబర్ 1 మొదలు పెట్టారు. అయితే సినిమా మొదలయ్యే టైం లో రాజమౌళికి ఇతను నా హీరో ఏంటి అని ఎన్టీఆర్ ను చూసి అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ నటన చూసి మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ అభిమానిగా మారిపోయాడు.

 

ఇతనే కాదు ఎన్టీఆర్ తన నట జీవితంలో ఎంతోమందికి షాక్ ఇచ్చాడు. ముందు తనని అసహ్యించుకున్న వారిని సైతం తన అభిమానులుగా చేసుకున్నాడు. స్టూడెంట్ నంబర్ 1 నుండి మొదలైన రాజమౌళి, ఎన్టీఆర్ కాంబో ఆ తర్వాత సింహాద్రి అంటూ సంచలన విజయం అందుకున్నారు. ఇక యమదొంగ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ చెప్పిన ఏమంటివి ఏమంటివి డైలాగ్ అయితే మళ్ళీ అన్నగారిని తేరా మీద చూసిన ఫీలింగ్ వస్తుంది. తాత చూపిన బాట.. తండ్రి ఇచ్చిన ఈ జీవితం ఎన్టీఆర్ ను నటుడిగానే కాదు మనిషిగా కూడా మహోన్నత స్థాయిలో నిలబెట్టేలా చేశాయి. 

 

ఎన్టీఆర్ తో పనిచేసే అందురు దర్శకులు సైతం ఆయన వినమ్రతకు ఆశ్చర్య పోతారు. ఒక స్టార్ హీరో కోట్ల మంది అభిమానులు ఉన్న హీరో ఇంత సింపుల్ గా ఎలా ఉంటాడు.. ఉండగలడు అంటే.. చిన్నప్పటి నుండి ఆయన పడ్డ కష్టాలే ఆయన్ను ఇప్పుడు ఈ స్థాయిలో కూడా మర్చిపోకుండా ఉండటమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ త్వరలో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: