నందమూరి నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన జూనియర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్‌ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. నందమూరి హీరోనే అయినా తన స్వశక్తితోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్‌. అంతేకాదు తనని తాను నటుడిగా ఒక్కో సినిమాతో సాన బడుతూ ఇప్పుడు ది బెస్ట్ పర్‌ ఫార్మార్‌ అనే స్థాయిలో ఎదిగాడు. అచ్చు గుద్దినట్టుగా తాత పోలికలను పునికి పుచ్చుకున్న ఎన్టీఆర్‌ ను తాత పాత్రల్లో చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

 

అయితే అభిమానుల కోరిక మేరకు యమదొంగ సినిమాలో పౌరాణిక పాత్రలో కనిపించి అలరించాడు తారక్‌. ఆ సినిమాలో యముడిగా ఎన్టీఆర్ ఆహార్యం, డైలాగ్స్‌, బాడీ లాంగ్వేజ్‌ సూపర్బ్ అనిపించాయి. ముఖ్యంగా మానవ జాతీ గురించి ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్స్‌ థియేటర్లలో విజిల్స్‌ వేయించటమే కాదు సినిమా మీద కనక వర్షం కురిపించింది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ను పూర్తి స్తాయి సినిమాలో పౌరాణిక పాత్రలో చూడాలని అభిమానులు మరింతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాన వీర శూర కర్ణ సినిమాను ఎన్టీఆర్ రీమేక్‌ చేస్తే బాగుంటుందన్న వాదన చాలా కాలంగా ఉంది.

 

ఆ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కృష్ణుడు, దుర్యోధనుడి పాత్రలకు పెద్ద ఎన్టీఆర్‌  చేసిన న్యాయం ఈ జనరేషన్ లో జూనియర్ మాత్రమే చేయగలడని భావిస్తున్నారు. అందుకే అలాంటి సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్ నటిస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతానికి తాత సినిమాలు రీమేక్ చేసే ఆలొచన లేదన్నట్టుగానే చెపుతున్నాడు. ఒక్కో సినిమాతో ఇమేజ్‌తో పాటు తన మార్కెట్‌ రేంజ్‌ను కూడా పెంచుకుంటూ వస్తున్న జూనియర్‌ భవిష్యత్తులో అయిన అభిమానుల కోరిక మేరకు తాత పాత్రలో కనిపిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: