మన తెలుగులో కొంత మంది హీరోల గురించి దర్శక నిర్మాతలు పదే పదే చెప్తూ ఉంటారు. వాళ్ళ తో సినిమా తీయడం అనేది ఒక వరం అంటూ మాట్లాడుతూ ఉంటారు. సినిమా చేస్తే ఇలాంటి వాళ్ళతో చెయ్యాలి లేదా చేయకూడదు అనే విధంగా కొందరు దర్శక నిర్మాతల నుంచి మనకు ఎక్కువగా వ్యాఖ్యలు వినపడుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు ఈ కథ అనుకున్నాడు అందులో తారక్ పాత్ర ఈ విధంగా ఉంటుంది అని తెలియగానే ఎన్టీఆర్ మాత్రం ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు  అనేది వాస్తవం. 

 

కథ ఎలా ఉన్నా సరే తన పాత్రకు సినిమా అంగీకరించిన తర్వాత న్యాయం చెయ్యాలి అనే భావన లో తారక్ ఉంటాడు. ఏ సీన్ అయినా సరే దర్శకుడు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పగానే ఇబ్బంది పడకుండా నటిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అతను చేసే ఆర్ఆర్ఆర్ సినిమాలో అతని నటన లో విశ్వ రూపం కచ్చితంగా ప్రేక్షకులు అతని అభిమానులు చూస్తారు అని అంటున్నారు. రాజమౌళి ఆ విధంగా తారక్ పాత్రను అన్ని విధాలుగా ప్రేక్షకులకు దగ్గర చేసే విధంగా రూపొందించారు అని అంటున్నారు. 

 

చాలా మంది దర్శకులు సినిమా ఫెయిల్ అయినా సరే తారక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు అని చెప్తూ ఉంటారు. అతని నటన అయినా సరే ఏది అయినా సరే సినిమాకు అతని నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అతని తో సినిమా చేస్తున్న జక్కన్న కూడా అతని గురించి ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో మీడియా ముందు చెప్పారు కూడా ఆ విధంగా తారక్ దర్శకులకు తగిన విధంగా నటిస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: