సాధారణంగా స్టార్ హీరో అనగానే చాలా మందికి అహం ఉంటుంది. తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి లేదా తాను ఎవరికి అందని విధంగా ఉండాలి అనే విధంగా చాలా మంది స్టార్ హీరోలు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ వలన ఎదుటి వారు ఇబ్బంది పడినా సరే వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు కొంత మంది అయితే చాలా మంది తో సినీ పరిశ్రమలోనే మాట్లాడటానికి ఆసక్తి చూపించే అవకాశం ఉండదు అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. దాని వలన వాళ్లకు వచ్చేది ఏంటీ అనేది పక్కన పెడితే వాళ్ళు మాత్రం చాలా అతి చేస్తూ ఉంటారు అనేది మాత్రం వాస్తవం. టాలీవుడ్ లో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనేది వాస్తవం. 

 

అయితే టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ విధంగా ఉండదు అని చెప్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. అతని తో సినిమా చేయడానికి గాని అతని తో మాట్లాడటానికి గాని ఏ ఇబ్బంది ఉండదు అనేది చాలా మంది చెప్పే మాట. అతని తో సినిమా చేయడానికి తాము ఎప్పుడు కూడా ఇబ్బంది పడినట్టు ఏ దర్శక నిర్మాత కూడా మీడియా ముందు గాని ఎక్కడా గాని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చెప్పిన సందర్భం అనేది ఎక్కడా కూడా లేదు అనే చెప్పాలి. ఆ విధంగా తారక్ తన నటన తో మెప్పించాడు అభిమానులను. 

 

అలాగే తన లో వ్యక్తిత్వం తో కూడా ఆకట్టుకున్నాడు. ఏ సినిమా అయినా సరే ఏ విధం గా అయినా సరే తను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నటిస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. ప్రస్తుతం మన తెలుగులో అతని తర్వాతే ఎవరు అయినా అనే విధంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: