సాధారణంగా స్టార్ హీరోలు అనగానే వాళ్ళు చెప్పిందే వేదం అనే విధంగా ఉంటుంది ఎక్కడ అయినా సరే కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలాంటి పరిస్థితి ఏ విధంగా చూసినా సరే ఉండదు అనేది చాలా మంది చెప్పే మాట. ఒక సినిమాను అతను ఓకే చేసినా లేదా అతను ఏ కార్యక్రమాన్ని అయినా సరే ఓకే చేసినా సరే తనకు నచ్చిన చోట షూటింగ్ చెయ్యాలి లేదా తన కుటుంబ సభ్యులను కూడా తీసుకుని రావాలి తాను దూరంగా ఉండలేను వంటి మాటలతో ఏ రోజు కూడా అతను సినిమా యూనిట్ ని ఇబ్బంది పెట్టలేదు అని అంటూ ఉంటారు. 

 

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళు చెప్పిందే జరగాలి అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్లకు నచ్చింది జరగలేదు అంటే వాళ్ళు ఎవరి మాట కూడా వినే పరిస్థితి ఉండదు. కాని తారక్ మాత్రం సెట్స్ లో ఎవరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అని షూటింగ్ కి ఏ రోజు కూడా తన పిల్లలను గాని భార్యను గాని అమ్మను గాని తీసుకొచ్చి దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టిన సందర్భం అనేది ఎప్పుడు లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళు కూడా అతని మాటను కాదని ఎప్పుడు కూడా షూటింగ్ కి రాలేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ లో వారి గురించి బాగా తెలిసిన వాళ్ళు. 

 

ఏ రోజు కూడా దర్శక నిర్మాతలను తారక్ అసలు ఈ విషయంలో ఇబ్బంది పెట్టింది లేదు అనేది చాలా మంది చెప్పే మాట. అతను కెరీర్ లో అతను ఎన్ని సినిమాలను చేసినా సరే ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: