బాబాయి అబ్బాయి... టాలీవుడ్ లో మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ గురించి ఎన్నో సందర్భాల్లో అనుకున్న మాటలు ఇవి. బాబాయి అబ్బాయి కలిసి సినిమా చేస్తారు వాళ్ళు ఇద్దరూ కలిసి నటిస్తారు అని ఎన్నో వార్తలు మన తెలుగులో వచ్చాయి. ఇక వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు టాలీవుడ్ జనాలు. బాబాయి బాలకృష్ణ కు తారక్ ఎన్నో సందర్భాల్లో విలువ ఇచ్చే వాడు అని అంటారు. ఇప్పటికి కూడా అతను ఎవరి తో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే కుటుంబం లో బాలకృష్ణ కు అన్నీ చెప్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. 

 

బాలయ్య కూడా తారక్ విషయంలో చాల వరకు సానుకూలంగా ఉంటారు అని అని చెప్తూ ఉంటారు. ఏ విధంగా అయినా సరే తారక్ కి ఏ కష్టం వచ్చినా సరే బాలకృష్ణ ముందు నుంచి అండగా నిలబడే వారు అని అంటూ ఉంటారు. అతను ఏ సినిమా చేసినా సరే ముందు నుంచి బాబాయి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉండేది అని చెప్తూ ఉంటారు. తారక్ ముందు కథలు వినే విషయ౦లొ చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని ఆ సమయంలో తారక్ కి బాబాయి నుంచి మంచి మద్దతు వచ్చింది అని అంటూ ఉంటారు. 

 

టాలీవుడ్ లో తారక్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే కచ్చితంగా బాబాయి మద్దతే అని అంటారు టాలీవుడ్ జనాలు. బాబాయి విషయంలో అతను కూడా ముందు నుంచి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన సందర్భం అనేది లేదు అని అంటూ ఉంటారు. టాలీవుడ్ లో తారక్ ని బాబాయి సహకారం తో పాటుగా బాబాయి కి ఉన్న పలుకుబడి కూడా ఒక స్థాయిలో నిలబెట్టింది అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: