ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో చెలరేగిపోయే వర్మ లాక్డౌన్ దగ్గర నుండి వివాదాలకి దూరంగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో తన మెస్సేజ్ ల ద్వారా ఇతరులని ఇబ్బంది పెట్టే వర్మ, ప్రస్తుతం కరోనా వైరస్ పై వరుసగా కౌంటర్లు వేస్తున్నాడు. ఇప్పటికే కరోనా మీద రెండు పాటలు కూడా రిలీజ్ చేశాడు.  అయితే తాజాగా కరోనాని పక్కన పెట్టి మియా మాల్కోవాతో తీసిన క్లైమాక్స్ సినిమా ప్రమోషన్స్ మీద పడ్డాడు.

 

గతంలో మియా మాల్కోవాతో జీఎస్టీ అనే షార్ట్ ఫిలిమ్ లాంటిది తీసి సంచలనం సృష్టించాడు. అప్పట్లో దానిపై ఎన్నో వివాదాలు రేకెత్తాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమెతోనే క్లైమాక్స్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తీశాడో, ఎక్కడ తీశాడో ఎవ్వరికీ తెలియదు. రెండు రోజుల్లోనే టీజర్ అన్నాడు. మరో రెండు రోజుల్లోనే ట్రైలర్ రిలీజ్ చేశాడు. మరికొద్దిరోజుల్లో సినిమాని కూడా రిలీజ్ చేస్తా అంటున్నాడు.

 

అయితే ఈ క్లైమాక్స్ టీజర్ కి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. మియా మాల్కోవా అందాలు ప్రేక్షకులని కనువిందు చేయకపోవడం ఒకటైతే, ఆ టీజర్ లో దేని గురించి చెప్తున్నాడో అర్థం కాకపోవడం మరోటి. కేవలం మియా అందాల మీదే దృష్టి పెడుతూ తీసిన చిత్రమిదని స్పష్టంగా తెలిసిపోయింది. అయితే ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమైన ఆర్జీవీ, ఆర్జీవీ వరల్డ్ థియేటర్ కి రమ్మంటున్నాడు.

 

సినిమాలని థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం లేదు కాబట్టి అందరూ ఓటిటీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఒక ఓటీటీ వంటి ఫ్లాట్ ఫామ్ కి క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడకి లాగ్ ఇన్ అయిన వాళ్ళు సినిమా చూడాలంటే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. పే పర్ వ్యూ విధానం ఇక్కడ అమల్లో ఉంటుందన్న మాట. ఇలాంటి విధానం గతంలో ఉన్నదే. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: