రేపు అనగా మే 20 తేదీన జూనియర్ ఎన్టీఆర్ తన 37 వ సంవత్సర జన్మదిన వేడుకలు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా మన అతని గురించి కొన్ని ఆసక్తికర నిజాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 


1. 1991వ సంవత్సరంలో విడుదలైన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 


2. తన యుక్తవయసులో జూనియర్ ఎన్టీఆర్ చాలా సంవత్సరాల పాటు భరతనాట్యం కూచిపూడి నాట్యం కఠోరమైన పట్టుదల, శ్రమతో నేర్చుకొని ఎన్నో స్టేజ్ లపై నాట్య ప్రదర్శన చేసి అందర్నీ బాగా మెప్పించేవాడు. ఆ అనుభవమే ప్రస్తుతం అతని తెలుగు పరిశ్రమలో ఒక గొప్ప డాన్సర్ గా తీర్చిదిద్దింది. 


3. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 4 సినిమాలలో నటించిన ఏకైక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు. అతని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా లో నటించే ఛాన్స్ వచ్చినా అదృష్టంగా భావించాలి మరి అతడితో నాలుగు సినిమాలు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంత అదృష్టవంతుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


4. 2004వ సంవత్సరంలో నిర్వహించిన ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ ఈవెంట్ కి 10 లక్షల మంది అభిమానులు తరలివచ్చారు. ఈ ఆడియో ఫంక్షన్ కు జనాలను తరలించేందుకు ఇండియన్ రైల్వే బోర్డు ఏకంగా 10 ప్రత్యేక రైళ్లను నడిపించి అంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి భారీ ఆడియో ఫంక్షన్ ఇంత వరకూ జరగలేదు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచి అందరి ఆశలపై నీళ్లు చల్లింది. 


5. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్ లో రెండుసార్లు స్థానం సంపాదించుకున్న ఏకైక తెలుగు హీరో గా రికార్డ్ సృష్టించాడు తారక్. 2012, 2016 లో అతని పేరు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్ లో కనిపించింది. 


6. అతనికి నెంబర్ 9 అంటే బాగా సెంటిమెంట్. అందుకే తన సోషల్ మీడియా ఖాతా పేర్లలో, కార్లపై తదితర వాటిపై నెంబర్ 9 వచ్చేలా చూసుకుంటాడు. తన బిఎండబ్ల్యూ కార్ పై 9999 అనే రిజిస్టర్ నెంబర్ కోసం ఏకంగా పది లక్షల రూపాయలను వెచ్చించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: