ఎన్టీఆర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు .. ఎందుకంటే అంతగా ఫేమస్ అయ్యాడు అందుకే నందమూరి వారసుడుగా తారక్ అభిమానుల గుండెల్లో నిలిచాడు. నందమూరి వారసుడుగా  సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు.. అందుకే చాలా మందికి నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం.. 

 

 

 

 

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి . 

 

 

 


అలా ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.. అవెంటంటే స్టూడెంట్ నెంబర్ వన్, అలాగే ఆది, అశోక్ , యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్ ఈ సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. స్వతహాగా కూడా ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే..తన మంచి మనసు పదిమందికి సాయం చేయాలనే తన తపన చాలా మంది అభిమానుల మనసును చూరగొన్నాడు.. అందుకే ఆయన అంటే సినీ ప్రేక్షకుల తో పాటుగా నందమూరి అభిమానులకు కు కూడా చాలా ఇష్టం..ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.. ప్రతికథానాయకుడు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: