నందమూరి వారసుడు అంటే వినిపించే పేరు జూనియర్ ఎన్టీఆర్.. అన్న ఎన్టీ రామారావు తర్వాత అంతటి ఘనత సాధించిన వ్యక్తి అంటే వినపడేది మాత్రం ఎన్టీఆర్ పేరే.. నటవారసుడు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన కష్టం తో ఒక్కో సినిమాలో తన టాలెంట్ ను పెంచుకుంటూ ఇప్పుడు జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోగా హవాను కొనసాగిస్తున్నారు.. సినిమాలు కూడా అతని స్థాయిని మరింత పెంచాయి. అని వేరేలా చెప్పనక్కర్లేదు..

 

 

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి . 

 

 


అలా ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.. అవెంటంటే స్టూడెంట్ నెంబర్ వన్, అలాగే ఆది, అశోక్ , యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్ ఈ సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. స్వతహాగా కూడా ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే..తన మంచి మనసు కూడా చాలా మంచిదే.. అందుకే ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. 

 

 


అసలు విషయానికొస్తే .. ఎన్టీఆర్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు టాప్ రేంజులో ఉన్న హీరోయిన్లు ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలని నందమూరి అభిమానులు ఆత్రుత చూపిస్తున్నారు...అతని సినిమాలలో ఇటీవల విడుదలైన సినిమాల విషయానికొస్తే సమంత , నిత్యామీనన్, పూజ హెగ్డే, నివేదా థామస్ ఇలా అందరూ ఇప్పుడు టాప్ హీరోయిన్ లు గా చక్రం తిప్పుతున్నారు.. తారక్ తో సినిమాలు చేస్తే వారి లైఫ్ ఇలా రయ్యిననాల్సిందే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: