నందమూరి తారక రామారావు మరణించిన తర్వాత తారక్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. తనని, తన తల్లి అయిన షాలిని ను బాగా ఆదరించి చాలా చక్కగా చూసుకునే తన తాత ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత నందమూరి కుటుంబంలో ని ఎవరు తనని చేరదీయలేదు. దాంతో తన జీవితంలో తానే స్వయంగా కష్టపడి పైకి రావాలని తెలుసుకున్న తారక్... ప్రతి సినిమా కార్యాలయానికి కాళ్లరిగేలా తిరిగేవాడు. తాను కలవని నిర్మాత దర్శకుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ క్రమంలోనే ఒకరోజు రాఘవేంద్ర రావు వద్దకు వెళ్లిన తారక్... హలో అంకుల్ నా పేరు నందమూరి తారక రామారావు. నేను బాల రామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించడంతో పాటు ఎన్నో నృత్య ప్రదర్శనలను ఇచ్చాను. మీరు ఎందరో కొత్త హీరో లను మీ సినిమాల్లో నటింపచేశారు. నన్ను కూడా మీ సినిమాల ద్వారా హీరోగా పరిచయం చేయండి అని అడిగాడు. 


దాంతో రాఘవేంద్ర రావు జూనియర్ ఎన్టీఆర్ ని తన ప్రియ శిష్యుడైన రాజమౌళి కి పరిచయం చేసి నువ్వేదో సినిమా తీస్తున్నావంట కదా ఈ అబ్బాయిని మీ సినిమాలో హీరోగా పెట్టుకో. కావాలంటే నేను దర్శకత్వం లో సహాయం చేస్తాను" అని అన్నాడట. అయితే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ని చూసి ఇతనేంటి ఇంత లావుగా ఉన్నాడు. నా సినిమాలో హీరో సన్నగా హ్యాండ్సమ్ గా ఉండాలని నేను అనుకున్నాను. సరే గురువుగారు చెప్పారు కదా ఏం చేస్తాం అతడితోనే మూవీ చేయడం తప్ప మరే ఇతర ఆప్షన్ లేదు అనుకుంటూ 2001వ సంవత్సరంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో తారక్ తో కలిసి మొదలు పెట్టాడట. 

 

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే తారక్ లో అద్భుతమైన నటన ప్రతిభ తో పాటు పట్టుదల కృషి పెద్ద స్టార్ అయ్యే ప్రతి ఒక్క క్వాలిటీ తనలో ఉందని రాజమౌళికి అర్థమయ్యిందట. వెంటనే అతనికి బాగా దగ్గరయ్యాడట. తదనంతరం వాళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తారక్ చార్మింగ్ పర్సనాలిటీకి దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా బాగా ఆకర్షితుడయ్యాడు. తాను చాలా సందర్భాల్లో నా అభిమాన నటుడు తారక్ అని స్పష్టం చేశాడు. దీన్నిబట్టి తారక్ రాజమౌళికి స్నేహమంటే ఏమిటో చూపించాడని అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా తారక్ ని ఇష్టపడే వారే తప్ప ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా?!

మరింత సమాచారం తెలుసుకోండి: