టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన‌ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు మ‌న‌వుడిగా ఎన్టీఆర్ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేశారు. మ‌రియు డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, యాక్టింగ్‌లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.  ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న తారక్.. ఆ తర్వాత కొన్ని పరాజయాలను చవి చూశాడు.

 

అయితే, కొన్నేళ్ల నుంచి అతడు విజయవంతమైన చిత్రాలను అందిస్తూ దూసుకుపోతున్నాడు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి చాలా విష‌యాలు కొంద‌రికి తెలియ‌క పోవ‌చ్చు. అలాంటి వాటిలో ఎన్టీఆర్ అస‌లు పేరు. జూ.ఎన్టీఆర్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు అసలు పేరు జమాలత్‌ పాషా. అవును! ఈయ‌న అలలు పేరు జమాలత్‌ పాషానే. ఆ త‌ర్వాత నందమూరి తారక రామారావుగా తాత‌గారు పేరు మార్చారు. ఇక 1983 మే 20న హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించాడు.

 

అలాగే తారక్‌ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే కూచిపూడి నాట్యం నేర్చుకోని పలు ప్రదర్శనలిచ్చాడు. ఓసారి అనుకోకుండా తారక్‌ అభినయాన్ని చూసిన తన తాత సీనియర్‌ ఎన్టీఆర్‌.. అతనిలోని ప్రతిభను, కళాభిమానాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంతో జూ.ఎన్టీఆర్‌ను బాలనటుడిగా వెండితెరకు పరిచయం చేశారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ హీరోగా ఎన్ని స‌క్సెస్ మొట్లు ఎక్కాడో అంద‌రికీ తెలిసిందే. ఇక బాల్యంలో కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందడం అతడి నట జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది. సినిమాల్లో మంచి డ్యాన్సర్​గా పేరు తెచ్చుకున్నాడు. పాటలకు అడుగులు కదపడం, మాటలకు భావం పలకడం ఈ హీరోకు సొంతం.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: