దేశంలోనే పొడవైన నదుల్లో ఒకటిగా పేరుగాంచిన గోదావరి అందాలు తిలకించాలంటే పాపికొండలకు మించిన ప్రదేశం లేదని అంటారు. పాపికొండల మధ్య గోదావరి ప్రయాణానికి కూడా పర్యాటకులు ఉత్సాహం చూపించేది అందుకే. ఎన్నో సినిమాల్లో కూడా గోదావరి అందాలు చూపించింది ఈ ప్రాంతంలోనే. ఈ క్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ ‘గోదావరి’ అంతటి ఆహ్లాదాన్నే కలిగిస్తుంది. సినిమా చూస్తున్నా గోదావరి నదిలో ప్రయాణం చేసినట్టే ఉండే ఆ సినిమా విడుదలై నేటితో 14ఏళ్లు పూర్తయ్యాయి.

IHG's A Honest ̶L̶O̶V̶E̶ HATE <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LETTER' target='_blank' title='letter-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>letter</a> To <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SEKHAR KAMMULA' target='_blank' title='sekhar kammula-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sekhar kammula</a> Garu From ...

 

సుమంత్ హీరోగా కమలినీ ముఖర్జీ హీరోయిన్ వచ్చిన ఈ సినిమా 2006 మే19న విడుదలైంది. రాజమండ్రి నుంచి గోదావరి నదిలో లాంచిలో ప్రయాణం చేసి భద్రాచలం చేరుకుని శ్రీరాముడిని దర్శించుకోవడమే ఈ సినిమా ఇతివృత్తం. దీనికి శేఖర్ కమ్ముల ఓ చిన్న లవ్ స్టోరీని అల్లుకున్నాడు. అందమైన పాపికొండల మధ్య వంపులు తిరిగిన గోదావరి నదిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో లాంచీ ప్రయాణం సినిమాకు హైలైట్. కుటుంబాలు, సరదాలు, గిల్లికజ్జాలు.. మధ్య ఈ కథ సాగుతుంది. సినిమాలో ఓ కీలకపాత్రలో హిందీ నటి నీతూ చంద్ర నటించింది. సుమంత్కమలినీ ముఖర్జీ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

IHG

 

సినిమా 1973లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బాపు దర్శకత్వంలో వచ్చిన అందాలరాముడు సినిమా తరహాలోనే ఉంటుంది. ఆ సినిమాలో కూడా గోదావరి నదిలో ప్రయాణం, భద్రాద్రి రాముడి దర్శనమే ఇతివృత్తం. ఈ జనరేషన్ లో తీసిన గోదావరి కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని శతదినోత్సవ సినిమాగా నిలిచింది. రాధాకృష్ణన్ సంగీతంలో పాటలు హిట్టయ్యాయి. ఎస్ఎస్ సీ ఆర్ట్స్ బ్యానర్ పై జీవీజీ రాజు ఈ సినిమాను నిర్మించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ సినిమాల్లో గోదావరికి ప్రత్యేక స్థానం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: