టిక్ టాక్ వచ్చిన తరువాత మనిషి తన సొంత ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. మితిమీరిన ఆశతో నానా చెత్త వీడియోస్ చేసి స్టార్ ఇమేజ్ కొట్టేద్దామనుకుంటున్నారు. తాజాగా టిక్ టాక్ లో ఓ నటుడు చేసిన వీడియో యావత్ భారత మహిళావనిని విస్తుపోయేలా చేసింది. ఇటీవల అమీర్‌ సిద్ధీఖీ సోదరుడు ఫైజల్‌ సిద్దీఖీ చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో యూట్యూబ్ లో తెగ ట్రేండింగ్ అవుతోంది. ఈ వీడియోలో ఫైజల్‌ సిద్దీఖీ ..తనను మోసంచేసినా గర్ల్ ఫ్రెండ్ తో  "ఉస్నే తుమ్హే చోర్ దియా జిస్కే లియా తుమ్నే ముజే చోరా థా” డైలాగ్ చెబుతూ ఆమె పై యాసిడ్ పోసినట్టు ద్రావణాన్ని ఆమెపై చల్లుతాడు.

 

అయితే ఈ వీడియో తెగ ట్రేండింగ్ అయినప్పటికీ పలు మహిళా సంఘాలు ఫైజల్‌ సిద్దీఖీ పై కఠిన చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడుతున్నాయి. ఈ మేరకు NCW చైర్ పర్సన్ గా ఉంటున్న రేఖ శర్మ గారు ఈ వీడియో చేసిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర డీజీపీ ని ఆదేశించింది అదేవిధంగా ఫైజల్‌ సిద్దీఖీ అకౌంట్ ని క్లోజ్ చేయాలనీ సూచించింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ గాయని సోనా మెహపాత్ర ఫైజల్‌ సిద్దీఖీ కి మద్దతు ఇస్తూ తన సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే గతంలో బాలీవుడ్ గ్రేట్ స్టార్ అనుకుంటున్నా కండల వీరుడు తన మహిళా ఫ్రెండ్స్ లలో చాలామందిని వైన్ బాటిల్స్ తో వారి నుదుటిపై ఘోరంగా దాడి చేశారు అయితే ఈ సంఘటన ఎవరికి కనిపించదు అయినప్పటికీ అతను బాలీవుడ్ సూపర్ స్టార్ అంటూ దుయ్యబట్టింది.

IHG'slut ...

 

 

ఈ సడన్ ఏంటీ కాస్త వింతగా అనిపించినా గతంలో సల్మాన్ ఖాన్ పై పలు సార్లు విమర్శలు చేసి మీడియాకెక్కింది.  ఇది వరకు కూడా భారత్‌ సినిమా నుంచి చివరి నిమిషంలో ప్రియాంక చోప్రా తప్పుకొవడంపై కూడా ఆమె సల్మాన్‌పై ఆరోపణలు చేశారు. ‘ప్రియాంక తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ నిర్ణయంతో తను ఇతర అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు’ అని అన్నారు. కాగా అమిర్‌ సుద్దీఖీ సోదరుడు ఫైజల్‌ సోదరుడి టిక్‌టాక్‌ వీడియో హింసను ప్రేరింపించిందిగా ఉండటంతో ఆ సంస్థ వీడియోను తీసివేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: