సంభవామి యుగే యుగే సినిమా తర్వాత నవీన్ చంద్రకు ఐడెంటిటీ తెచ్చిన సినిమా అందాల రాక్షసి. ఆ సినిమాలో తన నటనతో మెప్పించిన నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా సినిమాలైతే చేశాడు కానీ పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఈమధ్య నెగటివ్ రోల్స్ కు కూడా సై అని చేస్తూ వెళ్తున్న నవీన్ చంద్ర లేటెస్ట్ గా ఇండిపెండెంట్ మూవీ.. వెబ్ మూవీలో నటించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రీకాంత్ నాగోతి డైరక్షన్ లో ఈ వెబ్ మూవీ తెరకెక్కింది. 


ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన సలోని లూత్రా నటించింది. ప్రస్తుతం సినిమాలతో పాటుగా వెబ్ సీరిస్ లు కూడా సత్తా చాటుతున్నాయి. అయితే ఇది మాత్రం వెబ్ మూవీగా రాబోతుంది. ఈమధ్యనే ట్రైలర్ రిలీజ్ అవగా అది చూసిన రెండు ఓటిటి ల నుండి ఆఫర్ వచ్చిందట. నేడో రేపో ఈ భానుమతి రామకృష్ణ వెబ్ మూవీ ఎందులో డిజిటల్ రిలీజ్ అవుతుందో తెలుస్తుంది. ఎలాగైనా సరే హీరోగా మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావాలని నవీన్ చంద్ర చేస్తున్న ప్రయత్నం మెచ్చుకుని తీరాల్సిందే. 


ఈ వెబ్ మూవీ ట్రైలర్ లో నవీన్ చంద్ర నటన మెప్పించింది. హీరో హీరోయిన్ జోడీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. భానుమతి రామకృష్ణ వెబ్ మూవీతో నవీన్ చంద్ర క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వస్తున్న మిస్ ఇండియా సినిమాలో కూడా నవీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ ఇలా ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే మరో ఆలోచన లేకుండా చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్నారు నవీన్ చంద్ర.     

 

     

మరింత సమాచారం తెలుసుకోండి: