మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలు, స్టేట్మెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. మెగా బ్రదర్ నాగబాబు చేసే పోస్ట్‌లు, పెట్టే కామెంట్స్ చూస్తుంటే కొంత ఆర్జీవీ పూనినట్టు అనిపిస్తూ ఉంటుంది. సినీ,రాజకీయ విషయాలను విశ్లేషించడానికి, తన అభిప్రాయాలను పంచుకోవడానికి యూట్యూబ్ ఛానెల్‌ను వాడుకుంటున్నాడు. ఇలా టెక్నాలజీని వాడుకుంటూ.. తన వ్యూస్‌ను ప్రజలు, అభిమానులతో పంచుకుంటున్నాడు. నా ఛానెల్ నా ఇష్టం పేరిట యూబ్యూబ్‌లో పెట్టే వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్లు అలాంటి వివాదమే రాజేశాయి. ప్రత్యర్థుల నుంచి కాకుండా సొంత పార్టీ వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొనేలా చేస్తున్నాయి ఆయన ట్వీట్లు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేనే నిజమైన దేశభక్తుడి అభివర్ణిస్తూ నాగబాబు వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం.

 

‘‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే…మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’’ అని మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేసారు. దీంతో నాగబాబు పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గాడ్సే ఏ ఉద్దేశంతో గాంధీని చంపినా.. జాతి పితను అలా హతమార్చడం మాత్రం దారుణం. దీంతో అతణ్ని చరిత్ర హీనుడిగానే చూస్తోంది ప్రపంచం. ఆర్ఎస్ఎష్ వాళ్లు మాత్రం గాడ్సేను హీరో లాగా చూస్తుంటారు. అతణ్ని కొనియాడుతుంటారు. ఇప్పుడు నాగబాబు ఈ ట్వీట్లు వేయడంతో అవి ‘బీజేపీ’ రంగు పులుముకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: