దాదాపు రెండు నెలలు నుంచి లాక్ డౌన్ ఉండటం, జూన్ ఎండింగ్ నాటికి షూట్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో  ఏ సినిమాకు ఎలా.. డేట్స్ అడ్జెస్ట్ చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నారు స్టార్ హీరోయిన్లు . లాక్ డౌన్ ముందు వరకు కు  ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయిన సినిమాలకు సరిపోను షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు హీరోయిన్లు . కానీ ఇప్పుడు అదంతా తారుమారైంది.

 

ఇప్పుడు డేట్స్  అడ్జస్ట్ చెయ్యడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది.  లాక్ డౌన్ తర్వాత మరి ఏ సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ వర్రీ అవుతున్నారు హీరోయిన్లు . ఏ సినిమాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్ధం కాక తిప్పలు పడుతుననారు హీరోయిన్లు . పూజాహెగ్డే  ప్రస్తుతం ఇలాంటి క్రైసిస్ లోనే ఉంది.  ప్రభాస్ తో చెయ్యబోతున్న జాన్ సినిమాకు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసింది కానీ.. లాక్ డౌన్ తో మొత్తం షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.  అందుకే ఇప్పుడు మిగతా సినిమాలను కాదని జాన్ కోసం బల్క్ లో డేటస్ ఇవ్వాల్సిన పరిస్తితి వచ్చింది పూజాకి. పూజా.. అక్షయ్ కుమార్ సినిమాతో పాటు సల్మాన్ సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వాల్సి ఉంది.

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియా 2020 కోసం దాదాపు 5 సినిమాలు ప్లాన్ చేసుకుంది. ఈ మధ్యలో కరోనా లాక్ డౌన్ వల్ల ఆలియా షెడ్యూల్ అంతా మారిపోయింది. ప్రస్థుతం బాలీవుడ్ లో  4 సినిమాలతో పాటు తెలుగులో ట్రిపుల్ ఆర్  చేస్తోంది ఆలియా.  ఇంత టైట్ షెడ్యూల్ లో  లాక్ డౌన్ తరువాత ఏ సినిమాకు  డేట్స్ అడ్జస్ట్ చెయ్యాలో తెలీక తెగ వర్రీ అవుతోంది ఆలియా. 

 

ఇలాగే డేట్స్ అడ్జస్ట్ చెయ్యాల్సి పరిస్తితిలో ఉంది ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ . నిధి ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ ఇలా  3 సినిమాలు చేస్తోంది. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత  అన్ని సినిమాలూ స్పీడందుకుంటాయి కాబట్టి... డేట్స్ విషయం లో క్లాష్ అవ్వడం గ్యారంటీ అని టెన్‌షన్ పడుతోంది నిధి.  ఇలా చాల మంది హీరోయిన్లు డేట్స్ తో ఇబ్బందిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: