టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే జనాలకు ముందు నుంచి కూడా ఒకరకమైన ఆసక్తి అనేది ఉంటుంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూసే పరిస్థితి కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఒకప్పుడు వర్మ వేరు ఇప్పటి వర్మ వేరే.. ఇప్పుడు వర్మ సినిమా వస్తుంది అంటే కొందరు సినీ అభిమానులు అసలు థియేటర్ల వైపు తొంగి చూసే పరిస్థితి లేదు.. ఇంకా చెప్పాలంటే అసలు వర్మ సినిమా పోస్టర్లు ను కూడా కొందరు చూడడం లేదు. అయితే వర్మ ను ముందు నుంచి అభిమానించే కొన్ని వర్గాలు మాత్రం ఆయన ఎప్పుడు ఏ సినిమా తీసినా ఆసక్తి కనపరుస్తుంటాయి.
ఇక వర్మ సినిమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వర్మ ఇక ఏది చేసినా సరే కాస్త సంచలనంగా ఉంటుంది అని అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు అతను మరో పోర్న్ స్టార్ ని లైన్ లో పెట్టినట్టు సమాచారం. ప్రస్తుత౦ మియా మాల్కోవాతో అతను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో పోర్న్ స్టార్ ని వర్మ లైన్ లోకి తీసుకున్నాడు అని ఆమె పేరు మియా ఖలీఫా అని సమాచారం. ఆమె తో ఒక బోల్డ్ సినిమాను ప్లాన్ చేసాడు అని తెలుస్తుంది.
ఒక స్కూల్ అమ్మాయి పోర్న్ స్టార్ గా మారడానికి క్లాస్ విద్యార్ధులు ఏ విధంగా కారణం అనేది ఈ సినిమాలో ఉంటుందట. ఈ సినిమాను తీయడానికి అతను ముంబై దగ్గరలోని ఒక రిసార్ట్ ని బుక్ చేశాడని... హాలిడేస్ లో ఒక స్కూల్ ని కూడా వాడుకునే అవకాశం ఉందని సమాచారం. ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే ఈ వార్త మాత్రం ఇప్పుడు బాలీవుడ్ లో టాలీవుడ్ లో కూడా ఎక్కువగా వైరల్ అవుతుంది.