రవితేజ టఫ్ ఫైట్ చేస్తున్నాడు. కెరీర్ ని ట్రాక్ ఎక్కించేందుకు అన్ని అస్త్రాలు బయటకు తీస్తున్నాడు. ఓ వైపు మాస్ ఎనర్జీ, మరోవైపు గ్లామర్ బాంబ్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. జనాలను థియేటర్స్ కు రప్పించేందుకు ట్రిపుల్ బొనాంజా ప్రిపేర్ చేస్తున్నాడు రవితేజ. 

 


రవితేజ సరైన హిట్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. వరుస డిజాస్టర్లతో పడిపోతున్న మార్కెట్ ను నిలబెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఫిట్ నెస్ నుంచి మేకోవర్ వరకు మొత్తం మార్చుకొని సినిమాల్లో నటిస్తున్నాడు. బ్యాడ్ ఫేస్ తో ఫైట్ చేస్తూ.. మాస్ ఎంటర్ టైనర్స్ తో నటిస్తున్నాడు. 

 


రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. సమ్మర్ లోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ తో ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇక క్రాక్ తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. ఇక ఈ మూవీకి మాస్ మహారాజ్ ఫుల్లుగా గ్లామర్ కోటింగ్ ఇస్తున్నాడని తెలుస్తోంది.  

 


రవితేజ-రమేశ్ వర్మ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఈ మూవీలో రవితేజ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఇక హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ ని సెలక్ట్ చేశారనీ.. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ని స్పెషల్ సాంగ్ కి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక డిస్కోరాజాలో నభా నటేశ్, పాయల్ ఇద్దరూ రవితేజకు జోడీగా నటించారు. 

 


రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ గా ఉంది. అందుకే ఆ హీరో మాస్ మహారాజా అయ్యారు. దానికి తోడు కొత్త బాడీ లాంగ్వేజ్ తో, సరికొత్త గెటప్ తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చూడాలి ఆయన అస్త్రాలు ఏ విధంగా పనిచేస్తాయో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: